Prabhas - Adipurush : ప్రభాస్ ’ఆదిపురుష్’ విడుదల తేదిని ప్రకటించిన చిత్ర యూనిట్..

ప్రభాస్ ఆదిపురుష్ (Twitter/Photo)

Prabhas - Adipurush Release Date : రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఓంరౌత్ దర్శకత్వంలో చేస్తోన్న ఆదిపురుష్ సినిమాను వచ్చే యేడాది విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 • Share this:
  Prabhas - Adipurush Release Date : రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముందుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రభాస్.. ఆదిపురుష్, సలార్‌ మూవీలతో ప్రాజెక్ట్ K సినిమాలు చేస్తున్నారు. . కరోనా సెకండో వేవ్ దెబ్బతో దేశ వ్యాప్తంగా థియేటర్స్‌ మూత పడ్డాయి. పరిస్థితులు కుదుట పడుతుండటంతో విడతల వారీగా పలు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గుండె కాయ వంటి ముంబైలో మాత్రం పూర్తి స్థాయిలో థియటేర్స్‌ను తెరవలేదు. వచ్చే నెల 22న మహారాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్‌ను ఓపెన్ చేస్తున్నట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు థియేట్రికల్ రిలీజ్‌ కోసం వేచి చూస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా థియోటర్స్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

  ఈ కోవలో ఆదిపురుష్ సినిమాను వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా  2022 ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నారు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా న‌టిస్తున్నారు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రలో యువ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు.  “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

  Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..

  ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.

  Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత పూర్తి సమయం గ్రాఫిక్స్‌కు కేటాయించనున్నారు.  ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.


  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: