హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Krishnam Raju: పెదనాన్న కృష్ణంరాజు తలుచుకుంటూ అద్భుతమైన వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్..

Prabhas - Krishnam Raju: పెదనాన్న కృష్ణంరాజు తలుచుకుంటూ అద్భుతమైన వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్..

కృష్ణంరాజును తలుచుకుంటూ ప్రభాస్ స్పెషల్ వీడియో (Twitter/Photo)

కృష్ణంరాజును తలుచుకుంటూ ప్రభాస్ స్పెషల్ వీడియో (Twitter/Photo)

Prabhas - Krishnam Raju | తెలుగు చలన చిత్రసీమలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు..ఈ నెల 11న  ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఆయన స్వర్గస్తులైయ్యారు. తాజాగా ప్రభాస్ పెదనాన్నను తలుచుకుంటూ ఓ వీడియోను షేర్ చేసారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలుగు చలన చిత్రసీమలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు..ఈ నెల 11న  ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఆయన స్వర్గస్తులైయ్యారు.  కృష్ణం రాజు (rebel star krishnam raju) అకాల మరణంతో టాలీవుడ్‌లో (Tollywood) విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో కాలం చేసారు  కృష్ణం రాజు. ఇక కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ పెదనాన్నను మించిన తనయుడిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్నారు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించిన కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇక కేంద్రంలో అధికార బీజేపీలో కొనసాగిన ఈయన మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రలు నివాళులు అర్పించారు. ఇక కృష్ణంరాజు మృతి తర్వాత కేంద్ర మంత్రలైన రాజ్‌నాథ్ సింగ్ వాళ్ల ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు.

  అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రభాస్ ఫ్యామిలీని ఫోన్‌లో పరామర్శించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా తన పెదనాన్న నటించిన సినిమాల్లోని సన్నివేశాలను సన్నివేశాలను షేర్ చేశారు.అందులో కృష్ణంరాజు చేసిన సన్నివేశాలనే ప్రభాస్ చేసిన ఒక విధమైన షాట్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెటింట వైరల్ అవుతోంది.

  View this post on Instagram

  A post shared by Prabhas (@actorprabhas)

  కృష్ణంరాజు స్మృతిలో  భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో  కృష్ణంరాజు మైనపు విగ్రహం రూపుదిద్దుకుంది. ఇటీవల కృష్ణం రాజు మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు కృష్ణం రాజు జ్ఞాపకాలను పదికాలాల పాటు ఉండేలా చూడాలని భావించారు. ఈ నేపథ్యంలో కృష్ణం రాజు విగ్రహాన్ని తయారు చేయించారు. కొత్తపేటలో ఫేమస్ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ను సంప్రదించారు. ప్రభాస్ తో సహా ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. ఆయన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి వడయార్ రూపొందించారు.రెబల్ స్టార్ తన జీవితంలో ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసారు.

  NBK - ChennakesavaReddy@20Years: బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ 20 యేళ్లు పూర్తి.. రీ రిలీజ్‌లో కూడా తగ్గని బాలయ్య జోరు..

  ముఖ్యంగా హీరోగా, నిర్మాతగా, తండ్రిగా, రాజకీయ వేత్తగా, కేంద్ర మంత్రిగా సినీ, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. ఇక ఈయన కంటూ తీరని కోరికలు కొన్ని ఉన్నాయి. ప్రభాస్‌‌ను తన దర్శకత్వంలో నటింపచేయాలనున్నారు. ప్రభాస్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించినా.. అతనితో తన ఆల్ టైమ్ క్లాసిక్ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకన్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టారు. కానీ ఎందుకో ముందుకు సాగలేదు.

  కృష్ణంరాజు తన తమ్ముడు కుమారుడు ప్రభాస్‌తో ‘విశాల నేత్రాలు’ అనే నవలను సినిమాగా తెరకెక్కించాలనున్నారు. దీనిపై కూడా స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. ఎందుకో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకుండానే కృష్ణంరాజు అనంత లోకాలకు వెళ్లిపోయారు.దీంతో పాటు గవర్నర్ పదవి చేపట్టకుండానే కన్నుమూయడం విషాదకరం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Krishnam Raju, Prabhas, Tollywood

  ఉత్తమ కథలు