Prabhas - Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.
ఈ సినిమాలో విక్రమ్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రికుడి పాత్రలో నటించారు. భవిష్యత్తు తెలిసే అతీంద్రియ శక్తులున్న వ్యక్తి పాత్రల నటించారు. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటించింది. ఇక బిల్లా, రెబల్ సినిమాల తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు అబ్బాయి ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో జగపతి బాబు, భాగ్యశ్రీ, మురళీ శర్మ నటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా తెరకెక్కించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 7000కు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందంటే...
నైజాం (తెలంగాణ): రూ. 36.50 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 18 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 13 కోట్లు
ఈస్ట్: రూ. 8.80 కోట్లు
వెస్ట్: రూ. 7.50 కోట్లు
గుంటూరు: రూ. 9.90 కోట్లు
కృష్ణా: రూ. 7.50 కోట్లు
నెల్లూరు: రూ. 4 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : 105.20 కోట్లు
కర్ణాటక: రూ. 12.50 కోట్లు
తమిళనాడు: రూ. 6 కోట్లు
కేరళ: రూ. 2.10 కోట్లు
హిందీ: రూ. 50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 3 కోట్లు
ఓవర్సీస్ : రూ. 24 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మన దేశంలో ఈ రేంజ్లో థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి చిత్రం ‘రాధే శ్యామ్’ కావడం విశేషం. ఈ సినిమాకు ప్రభాస్ నిర్మాత కావడంతో ఈ సినిమా బడ్జెట్ రూ. 150 కోట్ల వరకు అయినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ కాకుండా.. డిజిటల్, శాటిలైట్ రూపంలో రూ. 100 కోట్లు నిర్మాతలకు దక్కినట్టు సమాచారం.
Radhe Shyam Twitter Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ.. రెబల్ స్టార్ కుమ్మేసాడా..
ఇక ఈ సినిమాలో విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వివిధ దేశాధినేతలు, ప్రధానులకు, వివిధ ప్రముఖులకు జ్యోతిషం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో ఒదిగిపోయారు ప్రభాస్. రాధే శ్యామ్ మూవీ క్లైమాక్స్ హాలీవుడ్ మూవీ టైటానిక్ క్లైమాక్స్‌ను మించి ఈ సినిమాలో ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు.
RRR : ఆర్ ఆర్ ఆర్ అభిమానులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే..
హిందీలో అమితాబ్ బచ్చన్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం గాత్ర దానం చేసారు. ఈ సినిమాకు వివిధ భాషల్లో వేరు వేరు సంగీత దర్శకులు పనిచేశారు. దక్షిణాదికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. పైగా దేశంలో హిందీ చిత్ర పరిశ్రమకు గుండె కాయ వంటి ముంబైలో కరోనా కేసులో తగ్గడంతో 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్ రన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. ముంబై సహా ఇతర నగరాల్లో 100 శాతం ఆక్యుపెన్షీతో ప్రదర్శితం అవుతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishnam Raju, Prabhas, Radhe Shyam, Radhe Shyam Movie Review, Tollywood