Saaho: ప్రభాస్‌ను బ్యాడ్ బాయ్ అంటున్న జాక్వెలిన్ .. అసలు స్టోరీ ఇదేనా..

ఫ్రభాస్ ‘సాహో’ బ్యాడ్ బాయ్ సాంగ్ విడుదల (Twitter/Photo)

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘సాహో’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యాడ్ బాయ్ అంటూ కొత్త సాంగ్‌ను రిలీజ్ చేసారు.

  • Share this:
    ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘సాహో’ మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యాడ్ బాయ్ అంటూ కొత్త సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాట చూస్తుంటే.. అదేదో హాలీవుడ్ పాటను చూస్తున్నట్టే ఉంది. ఈ పాటలో ప్రభాస్ లుక్స్ పరంగా ఇంకా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు ఈ పాటలో అంతా హాలీవుడ్ వాళ్లే నటించారు. అంతేకాదు అందరు కలిసి ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసారు. ఈ పాట ‘సాహో’ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

    ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి బజ్ ఉంది. ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించింది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూవీ క్రియేషన్స్ వాళ్లు ఎలాంటి ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున నిర్మించారు. ఆగష్టు 30న విడుదల కాబోతున్న ఈ సినిమాతో ప్రభాస్ నిజంగానే ‘సాహో’ అనిపిస్తాడా లేదా అనేది చూడాలి.
    First published: