Saaho : ప్రభాస్ సీక్రెట్ బయటబెట్టిన శ్రద్ధాకపూర్... ఫ్యాన్స్ ఖుషీ...

Prabhas and Shraddha Kapoor : ప్రపంచ దేశాల్లో ప్రభాస్ ఇప్పుడో సూపర్ స్టార్. ఐతే... ఆ బాహుబలిలో మరో కోణాన్ని బయటపెట్టింది సాహో సినిమాలో కో స్టార్ శ్రద్ధాకపూర్. సౌత్ ఇండస్ట్రీలో తన ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకోబోతున్నట్లు తెలిపింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 9:29 AM IST
Saaho : ప్రభాస్ సీక్రెట్ బయటబెట్టిన శ్రద్ధాకపూర్... ఫ్యాన్స్ ఖుషీ...
సాహోలో సన్నివేశం (Image : Youtube)
Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 9:29 AM IST
సాహో యాక్షన్ థ్రిల్లర్‌లో డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి లీడ్ రోల్ చేస్తున్న శ్రద్ధాకపూర్... ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ రెబల్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ప్రభాస్ సూపర్ స్టార్ మాత్రమే కాదు... అతని మనసు వెన్న... అంటూ ఆకాశానికెత్తేసింది. సాహో ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న శ్రద్ధా... యూనిట్ మొత్తం బాహుబలి స్టార్‌ మంచి మనసుకి ఫిదా అయిపోయామని తెలిపింది. హైదరాబాద్‌లో షూటింగ్‌పై స్పందించిన ఈ బ్యూటీ... తనకు కలిగిన ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేనంది. చిత్ర యూనిట్ మొత్తం తనను తమ కుటుంబంలో సభ్యురాలిలా చూసుకున్నారని వివరించింది. రెండేళ్లపాటూ షూటింగ్ జరిగిందన్న ఆమె... హైదరాబాద్ తనకు రెండో హోమ్ అయిపోయిందనీ, వాళ్లు చూపించే ప్రేమాభిమానాల వల్ల ప్రతి రోజూ సెట్స్‌కి వెళ్లాలని అనిపించేదని తెలిపింది. తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని వివరించింది.

శ్రద్ధాకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. ఆగస్ట్ 30 సాహో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ఆమె నటించిన మరో మూవీ చిత్తోర్ కూడా సెప్టెంబర్ 6న రిలీజ్‌కి సిద్ధమైంది. అందులో శుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నటించింది. రెండు సినిమాలూ పూర్తిగా భిన్నమైనవి అన్న శ్రద్ధా... వాటిలో తాను నటించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపింది.

ఈ రెండు సినిమాలతోపాటూ... శ్రద్ధా మరో సినిమా స్ట్రీట్ డాన్సర్ 3డీలో కూడా వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. వేర్వేరు షూటింగ్‌లకు తగ్గట్టుగా తనను తాను రెడీ చేసుకునేదాన్నని తెలిపిన శ్రద్ధా... ఈ సంవత్సరం తన కెరీర్‌లో అత్యంత కీలకమైనదని తెలిపింది. స్ట్రీట్ డాన్సర్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మొదటి రెండు సినిమాల షూటింగ్స్ అయిపోవడంతో కాస్త రిలాక్స్ దొరికిందనుకున్న శ్రద్ధా... ఇప్పుడు ప్రమోషన్స్‌లో పడి బిజీ అయిపోయింది.

తెలుగు, తమిళం, మలయాళంతోపాటూ... హిందీలో రిలీజవుతున్న సాహో కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ కీలక పాత్రలు పోషించారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...