టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళి తీసిన బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్ సైతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీలను చేశాడు ప్రభాస్. ఇప్పుడు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె'.. ఇలా వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్.అయితే 'రాధేశ్యామ్' అనంతరం కాస్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్ విదేశాలకు వెళ్లారు. తన తదుపరి చిత్ర దర్శకుడు ప్రశాంkత్నీల్ తెరకెక్కించిన 'కేజీయఫ్-2' బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంపై ప్రభాస్ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
రామ్‌చరణ్, తారక్, యశ్‌లతో పాన్ ఇండియా స్థాయిలో పోటీ పెరిగిందని భావిస్తున్నారా..? అని ప్రశ్నించగా..దానికి ప్రభాస్ మాట్లాడుతూ.. ''మనం మరిన్ని చిత్రాలు తెరకెక్కించాలి. అదే విధంగా క్రాస్ ఇండియన్ సినిమాలపై కూడా మరింత దృష్టి పెట్టాలి. పాన్ ఇండియా సినిమాలు మంచి విజయం సాధించడం వల్ల ఆయా హీరోలతో నాకు పోటీ పెరిగిందని నేను భావించను. ఎందుకంటే.. ఉత్తరాది, దక్షిణాది ఇలా పరిశ్రమ ఏదైనా.. అందరం కలిసి మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు రూపొందిస్తే బాగుంటుందని నమ్ముతున్నా''అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా ప్రభాస్ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని తనకెంతానే నచ్చిందని చెప్పుకొచ్చాడు. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రం ఇదే కావడం తనకు ఎంతగానే ఆనందంగా ఉందన్నాడు బాహుబలి. పాన్ ఇండియా ప్రాజెక్ట్, అందులోనూ రాజమౌళి తెరకెక్కించడంతో ఈ సినిమా అన్ని చోట్ల మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుందన్నాడు ప్రభాస్. రాజమౌళి ఇప్పుడు దక్షిణాది దర్శకుడు కాదు. ఆయన ఇప్పుడు భారతీయ దర్శకుడు అంటూ జక్కన్నపై ఛత్రపతి ప్రశంసలు కురిపించాడు. అలాగే 'కేజీయఫ్-2' కూడా బ్లాక్‌బస్టర్‌పై కూడా డార్లింగ్ ప్రభాస్ మాట్లాడాడు. కేజీఎఫ్2 హిట్ అవ్వడం.. కేజీఎఫ్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ వంటి బిగ్గెస్ట్ డైరెక్టర్‌తో తాను సలార్ ప్రాజెక్టు చేస్తున్నందుకు తనకెందో ఆనందంగా ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో 'సలార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ టాక్ బయటికి రావడంతో ఖచ్చితంగా 'సలార్' ని కూడా ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ గా నిలపడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారట. 'రాధేశ్యామ్' విషయంలో ప్రభాస్ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఈ మూవీ తరువాత 'సలార్' లో నటిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారని 'కేజీఎఫ్ 2' సక్సెస్ తమకు బాగా కలిసి వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట. 'బాహుబలి' సీరీస్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. అయితే ఆ తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన 'సాహో' ఉత్తరాదిలో ఊపేసింది కానీ దక్షిణాదిలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KGF Chapter 2, Prabhas, Prashanth Neel, RRR, Salaar