• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PRABHAS HOLLYWOOD DIRECTOR CHRISTOPHER MCQUARRIE CLARIFIES ABOUT PRABHAS HOLLYWOOD ENTRY HERE ARE THE DETAILS TA

Prabhas - Hollywood: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై రచ్చ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

సలార్‌లో ప్రభాస్ (Twitter/Photo)

Prabhas - Hollywood: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. తాజాగా ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై జరుగుతున్న రచ్చపై మిషన్ ఇంపాజిబుల్ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    Prabhas - Hollywood: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ సినిమాతో  రెబల్ స్టార్  ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. తన సినిమాలన్నింటినీ ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత చేసిన ‘సాహో’తో ప్యాన్ ఇండియ ా ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ  దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో టైటానిక్ లెవల్లో ఉంటుందనేది టాక్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే పౌరాణిక సినిమా చేస్తున్నారు.

    మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ మిషన్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్.. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న టైమ్‌లో హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఆ టైమ్‌లో ఈ సినిమా దర్శకుడు క్రిష్టోఫర్ ఎం క్వారీ ప్రభాస్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్’ నెక్ట్స్ ఫ్రాంచైజీ కోసం మాట్లాడటం జరిగిందనేది టాక్. అంతేకాదు టామ్ క్రూయిజ్‌తో కలిసి ప్రభాస్ కలిసి నటించబోతున్నట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై రచ్చ షురూ అయింది.


    తాజాగా ప్రభాస్.. మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రంలో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనే దానిపై ఈ సినిమా దర్శకుడు క్రిష్టోఫర్ క్వారీ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఎంతో టాలెంటెట్ నటుడుని కానీ.. తాము మాత్రం ఆయన్ని ఎపుడు కలవలేదని ఈ రూమర్స్‌కు పులిస్టాప్ పెట్టారు. మొత్తంగా ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై జరుగుతున్న రచ్చపై క్లారిటీ వచ్చింది ప్రేక్షకులకు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: