Home /News /movies /

PRABHAS HEADS TO ITALY TO RESUME FILM SHOOT OF RADHE SHYAM SR

Prabhas : ఇటలీ‌ బయలుదేరిన ప్రభాస్.. పదిహేను రోజులు అక్కడే..

ప్రభాస్ ఇటలీ పయనం Photo : Twitter

ప్రభాస్ ఇటలీ పయనం Photo : Twitter

Prabhas : ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్'. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..

  ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్'. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్.. తిరిగి ప్రారంభించడానికి రెడీ అయ్యింది. అందులో భాగంగా ఇటలీలో ఓ 15 రోజుల షెడ్యూల్‌ను జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. దీంతో నేడు ఇటలీకి యూనిట్ బయలుదేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్‌తో పాటు కృష్ణంరాజు సొంత నిర్మాణ నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ తల్లిగా ఈ చిత్రంలో అలనాటి అందాల తార భాగ్యశ్రీ నటిస్తుండటం విశేషం. 'మిర్చి' మూవీతో నదియాను టాలీవుడ్‌కు అనేక సంవత్సరాల తిరిగి తీసుకొచ్చిన ప్రభాస్‌, ఇప్పుడు అదే తరహాలో భాగ్యశ్రీని చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి తీసుకొస్తున్నాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ..'సాహో సినిమా తర్వాత రావడంతో మంచి అంచనాలున్నాయి. పిరియాడిక్ లవ్ స్టోరి జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

  ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. లేట్‌గా వచ్చిన సరే.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించింది ఈ సినిమా ఫస్ట్ లుక్. ఇక మొదటి నుండి ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏమైఉంటుందని.. చాలా ఆసక్తిగా ఉన్నారు ఆమె అభిమానులు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాలా రూమర్స్ వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఆమె ఫస్ట్ లుక్ విడుదల వరకు వేయిట్ చేయాల్సిందే. దాదాపు 90 శాతం పూర్తైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆరు నెలల విరామం తర్వాత ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. 'రాధేశ్యామ్‌' షూటింగ్‌ను తిరిగి మొదలుపెబుతోంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో కీలక షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఇటలీ దేశానికి పయనం అయ్యింది. దాదాపు 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డేతో కీలక సన్నివేశాలను ఓ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

  ఈ చిత్రానికి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉండటంతో మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరు వినబడుతోంది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంతేకాదు ఆయన ఒక తమిళ్‌లో తప్ప ఏ భాషాల్లోను ఎక్కువుగా సంగీతం అందిచట్లేదు. ఆయన చేసిన చివరి హిందీ సినిమా. దిల్ బెచారా.. నాగ్ అశ్విన్ తన సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas Latest News, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు