‘రామాయణ’లో విలన్‌గా కనిపించనున్న ప్రభాస్ ?

ముందుగా ఈ క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచనలో ఉంది సినిమా టీం.

news18-telugu
Updated: September 18, 2019, 1:18 PM IST
‘రామాయణ’లో విలన్‌గా కనిపించనున్న ప్రభాస్ ?
ప్రభాస్ పేరును పరిశీలిస్తున్న యూనిట్ (పైల్ ఫోటోస్)
  • Share this:
రామాయణం ఓ మహా కావ్యం. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే సుందర కావ్యం. అందుకే రామయాణంపై చాలా సినిమాలు వచ్చాయి. అనేక భాషాల్లో ఈ మహాగాథను సిినమాల్లో చూపించారు. అయితే మరోసారి ‘రామాయణ’మహాగాథను మరోసారి వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అయితే ఇప్పటికే ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

prabhas or hrithik roshan will play sri rama character and jr ntr to play ravana character in allu aravind 3d ramayana movie worth 1500 crore budget with 3 parts in many languages
శ్రీరామ చంద్రుడిగా హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్న యూనిట్ (ఫైల్ ఫోటోస్)


రావణుడి పాత్ర కోసం కొంతకాలంగా అన్వేషణ జరుగుతోంది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు రావణుడిగా ప్రభాస్‌ని తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచనలో ఉంది సినిమా టీం. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో తనకున్న క్రేజ్ మరోసారి నిరూపించుకున్నారు. దీంతో ‘రామాయణ’లో రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను సంప్రదించే పనిలో పడ్డారు ఆ మూవీ టీం.

Nayanthara playing Sita in Allu Aravind's Ramayana began doing rounds on social media, అల్లు ‘రామాయణ్’ సీత ఎవరో తెలుసా ?
అల్లు అరవింద్ రామాయణం (పైల్ ఫోటో)
మరోవైపు అత్యంత భారీ సాంకేతికతో తెరకెక్కుతోన్నఈ సినిమాను మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణం సినిమాను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు.2021లో తొలి భాగం విడుద‌ల కానుంది. ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేయనున్నారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు