HOME »NEWS »MOVIE »prabhas fixed target for his next movie salaar and big festival to his fans mhn

Prabhas - Salaar: ‘స‌లార్‌’ టార్గెట్ ఫిక్స్ చేసిన ప్ర‌భాస్‌.. ఈ ఏడాది ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గే..!

Prabhas - Salaar: ‘స‌లార్‌’ టార్గెట్ ఫిక్స్ చేసిన ప్ర‌భాస్‌.. ఈ ఏడాది ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గే..!
Prabhas fixed target for his next movie Salaar and big festival to his fans

Prabhas - Salaar: ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, క్రేజీ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘స‌లార్‌’. ఈ సినిమా కోసం ప్రభాస్ పక్కా ప్లాన్ ప్రిపేర్ చేశాడని వార్తలు వస్తున్నాయి.

 • Share this:
  ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, క్రేజీ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘స‌లార్‌’. రీసెంట్‌గానే ఈ భారీ చిత్రం ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. రెగ్యుల‌ర్ షూటింగ్‌కు రెడీ అవుతుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం అవుతుంది. అక్క‌డి నుంచి కంటిన్యూగా స‌మ్మ‌ర్ వ‌ర‌కు షూటింగ్ చేస్తాడ‌ట‌. మార్చిలో చిన్న బ్రేక్, త‌ర్వాత స‌మ్మ‌ర్‌లో ఓ చిన్న బేక్ తీసుకుంటాడ‌ట‌. అదే స‌మ‌యంలో ప్ర‌శాంత్ నీల్ కూడా త‌న కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2 సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా మారుతాడు. త‌ర్వాత మొద‌లు పెట్టి జూలై కంతా పూర్తి చేయాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడ‌ట‌.

  అలా ప్ర‌భాస్ ప్లాన్ చేసుకోవ‌డానికి రెండు కార‌ణాలున్నాయ‌ట‌. ఒక‌టి స‌లార్ సినిమాను ద‌స‌రా బ‌రిలోకి తీసుకు రావాల‌నేది ప్ర‌భాస్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. రెండో కార‌ణం.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రావుత్ ప్ర‌భాస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. రాధేశ్యామ్ విడుద‌ల త‌ర్వాత ద‌స‌రాకు ప్ర‌భాస్ సినిమా అంటే ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పెద్ద పండ‌గేన‌ని చెప్పుకోవ‌చ్చు.  ప్ర‌భాస్‌, ఓం రావుత్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘ఆదిపురుష్‌’ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాల‌నేది ప్ర‌భాస్ ఆలోచ‌న‌. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుంటే, రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
  Published by:Anil
  First published:January 17, 2021, 22:07 IST

  टॉप स्टोरीज