హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్ షాకింగ్ పని.. బిల్లా షో వేసిన థియేటర్లో మంటలు..!

Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్ షాకింగ్ పని.. బిల్లా షో వేసిన థియేటర్లో మంటలు..!

ప్రభాస్ ఫ్యాన్స్ షాకింగ్ పని

ప్రభాస్ ఫ్యాన్స్ షాకింగ్ పని

ప్రభాస్, కృష్ణంరాజు నటించిన బిల్లా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో స్పెషల్ షోలు వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు అదుపు తప్పాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇవాళ డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్బంగా ప్రభాస్ అభిమానులు సందడి మాములుగా లేదు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాను రిరిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు మూతపడ్డ థియేటర్లలో ప్రదర్శించారు. అయితే అభిమానుల అత్యుత్సాహంతో ఓ థియేటర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తాడేపల్లి గూడెంలో చోటు చేసుకుంది. ప్రభాస్, కృష్ణంరాజు నటించిన బిల్లా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో స్పెషల్ షోలు వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు అదుపు తప్పాయి.

తాడేపల్లి గూడెంలోని వెంకటరమణ థియేటర్లో బిల్లా స్పెషల్ షో వేశారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు అభిమానులు. అయితే సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ఇతర హీరోల అభిమానులు కూడా ఇలాంటి పనులేంటి అని మండిపడుతున్నారు. ప్రభాస్ అభిమానులు సైతం ఇది కరెక్ట్ కాదని తప్పు పడుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. అయితే షోను మధ్యలోనే ఆపేశారని అందుకే ఇలా చేశామని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో హీరోల బర్త్ డే ల సందర్భంగా పాత సినిమాల్ని మరోసారి ఫ్యాన్స్ కోసం రి రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి, పవన్ బర్త్ డే సందర్భంగా జల్సా, బాలయ్య బాబు పుట్టినరోజున చెన్నకేశవ రెడ్డి సినిమాలు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బిల్లా సినిమాను ఫ్యాన్స్ కోసం మరోసారి విడుదల చేశారు.

First published:

Tags: Prabhas, Prabhas Latest News

ఉత్తమ కథలు