యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను దీపికా పదుకొణే భయపెడుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పేరుతో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ అని ముందుగా సంబరపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ ఇపుడు సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ఒకటే ఫీల్ అవుతున్నారు.
ప్రభాస్.. గత సినిమా ’సాహో’లో హిందీ భామ.. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్నిఅందుకోలేదు. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ సరసన బీ టౌన్ బ్యూటీ కంగనా రనౌత్ నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో బాలీవుడ్ భామలు యాక్ట్ చేస్తే ఆ సినిమాలు సరిగా నడవలేదు. అందుకే ఇపుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటిస్తోంది. దీంతో బ్యాడ్ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందా అని ఆందోళన చెందుతున్నారు.
దీనిపై మరికొందరు మాట్లాడుతూ.. చేసే సినిమా కథలో దమ్ము ఉండాలి కానీ ఈ సెంటిమెంట్ అనేవి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Bollywood, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood, Vyjayanthi Movies