ఈ రోజుల్లో పిల్లలు మరీ దారుణంగా మారిపోతున్నారు. జీవితానికి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. చావు అనేది వచ్చినపుడు ఎలాగూ తప్పించుకోలేరు.. అంతేకానీ ఎదురెళ్లి మరీ స్వాగతం చెప్పకూడదు కదా..! కనీసం లైఫ్ కు చిన్న పాటి మర్యాద కూడా ఇవ్వడం లేదు ఈ తరం పిల్లలు. చిన్నచిన్న కారణాలతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి చిత్రమే ఒకటి జరిగింది. అసలు అది కారణం అని చెప్పడానికి కూడా సిగ్గుపడేలా ఓ కుర్రాడు ప్రాణాలు తీసుకున్నాడు.
"సాహో" సినిమా ఆలస్యం అవుతుందనే కారణంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఇలాంటి ఓ కారణం ఉంటుందని కూడా ఎవరూ అనుకోరు కదా.. కానీ అదే జరిగింది. సూసైడ్ నోట్ కూడా రాసుకుని మరీ చనిపోయాడు ఆ కుర్రాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న "సాహో"పై భారీ అంచనాలునన్ఆయి. శ్రద్ధాకపూర్ ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తుంది సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో 200 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
కొన్ని రోజులుగా షూట్ అయితే జరుగుతుంది కానీ ఎలాంటి సమాచారం అయితే బయటికి రావడం లేదు. దాంతో ఓ ఫ్యాన్ బాగా హర్ట్ అయ్యాడు.. ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. అభిమాన హీరో సినిమా నుంచి ఎలాంటి సమాచారం లేదని మనస్తాపంతో ఉసురు తీసుకున్నాడు ఆ పిచ్చి అభిమాని. సుసైడ్ లెటర్లో తాను ప్రభాస్ ఫ్యాన్ అని.. తమ హీరో సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదని.. అందుకే మనస్తాపంతో తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసాడు.
ఈ విషయం యువీ క్రియేషన్స్ తో పాటు దర్శకుడు సుజీత్ వరకు వెళ్లింది. దాంతో ప్రభాస్‌కు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదని.. అయినా బాహుబలి కోసం ఐదేళ్లు వేచి చూసిన వాళ్లు సాహో కోసం వేచి చూడలేరా అంటూ స్పందించారు. అయినా ఓ హీరోపై ప్రాణాలు తీసుకునే అభిమానం ఉండొచ్చేమో కానీ ప్రాణం మాత్రం తీసుకోకూడదు. కనీసం జీవితం ముగించే ముందు జీవితాన్నిచ్చిన అమ్మానాన్నల గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా.. కనీసం ఆ వైపు ఒక్కసారి చూసుకోండి. అభిమాన హీరోల కోసం ప్రాణాలు ఇవ్వడం తీయడం రెండూ మంచిది కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood