ఔను.. సమంత అక్కినేని చేసిన పనివల్ల ప్రభాస్‌కు పెద్ద కష్టమే వచ్చిపడింది. వివరాల్లోకి వెళితే.. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘సాహో’ సినిమా ఫ్లాప్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన కథలో కీలక మార్పులు చేసి ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఐతే.. తాజాగా సమంత హీరోయిన్గా నటిస్తున్న చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఆల్రెడీ ప్రేక్షకుల్లో బాగా బలంగా నాటుకుపోయిన ఈ టైటిల్‌ను ప్రభాస్.. శర్వానంద్కో, దిల్ రాజు రిక్వెస్టింగ్ కారణంగా త్యాగం చేసినట్టు చెబుతున్నారు. తమిళ చిత్రం ‘96’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ పెట్టారు. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. మొత్తానికి ప్రభాస్ ఎంతో ఇష్టపడిన ‘జాన్’ టైటిల్‌ను దిల్ రాజు, శర్వానంద్‌ల కోరిక మేరకు ప్రభాస్ త్యాగం చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.