ప్రభాస్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న అనుష్క..

ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటోస్

Saaho | అవును ఇది నిజం... ప్రభాస్‌ను ఇపుడు అనుష్క ఇబ్బందుల పాలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    అవును ఇది నిజం... ప్రభాస్‌ను ఇపుడు అనుష్క ఇబ్బందుల పాలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌, అనుష్కల జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై బాహుబలి, దేవసేనల ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు దేశ వ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన ఆడియన్స్ ఫిదా అయ్యారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..‘సాహో’ కోసం దాదాపు రెండేళ్లుకు పైగా కేటాయించాడు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ,తమిళం, మలయాళంలో ఏక కాలంలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్.. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక విమానంలో తిరుగుతున్నాడు. ఈ సందర్భంగా ప్రతి చోట ప్రభాస్‌కు అనుష్కకు సంబంధించిన ప్రశ్నలతో వేధిస్తున్నారు జర్నలిస్టులు. దీనికి డార్లింగ్ కూడా ఎవరినీ నొప్పించకుండా.. ఇన్ని రోజుల్లో అనుష్కతో ఎక్కడైనా తిరిగినట్టు కనపడ్డానా అంటూ చాలా స్మూత్‌గా సమాధానమిస్తూ వస్తున్నాడు. అంతేకాదు నేను అనుష్కను కలిసి రెండేళ్లు అవుతుంది అంటూ చెప్పాడు.

    బాహుబలిలో అనుష్క శెట్టి, ప్రభాస్ (Twitter/Photo)


    ఐనా దేశంలోని వివిధ మీడియాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం అనుష్కతో ప్రభాస్‌ ఎఫైర్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉన్నారు. దీంతో ప్రభాస్ కూడా తను ఇంటర్వ్యూకు పిలిచే పాత్రికేయులకు అనుష్కకు సంబంధించిన క్వశ్చన్స్‌ అడగొద్దని చాలా మృదువుగా కోరుతున్నట్టు సమాచారం. మరి ప్రభాస్ మాటలను జర్నలిస్టులు ఏ మేరకు ఫాలో అవుతారో చూడాలి.
    First published: