Home /News /movies /

PRABHAS EXTENDED HIS WARM WISHES TO THE WINNERS AT BIRMINGHAM COMMON WEALTH GAMES WINNERS AND CONGRATULATED THE CHAMPIONS FOR MAKING NATION PROUD FRO BINGING GLORY TA

Prabhas : కామన్వెల్త్ క్రీడల విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

కామన్ వెల్త్ క్రీడల విజేతలకు ప్రభాస్ శుభాకాంక్షలు (Twitter/Photo)

కామన్ వెల్త్ క్రీడల విజేతలకు ప్రభాస్ శుభాకాంక్షలు (Twitter/Photo)

Prabhas - Common Wealth Games winners | ప్యాన్ ఇండియా ప్రభాస్ కామన్ వెల్త్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన భారత క్రీడా కారులకు శుభాకాంక్షలు తెలయిజేసారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  Prabhas - Common Wealth Games winners | దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)  దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో (Common Wealth Games) దేశం తరుపున పతకాలు సాధించిన క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్ స్టాగ్రామ్ లో భారత క్రీడా వీరులు సాధించిన పతకాల పట్టికను పోస్ట్ చేస్తూ తన గ్రీటింగ్స్ తెలిపారు.కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కంగ్రాట్స్. మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోంది. భారత దేశానికి  మెడల్స్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి’ అంటూ థాంక్స్ నోట్ పోస్ట్ చేశారు.

  బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారికైనా ఆయన బాహుబలిగా అభిమాన హీరో అయ్యారు. ఈ ఇమేజ్ కు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.  ఈ యేడాది ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) అనే సినిమాతో పలకరించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆదిపురుష్ (Adipurush) చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

  Naga Chaitanya Entry Into Bollywood: నాగ చైతన్య సహా బాలీవుడ్‌ బాట పట్టిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..


  ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఆదిపురుష్ సినిమాలో రామ్ చరణ్ కెమియో రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. అది కూడా సీతా స్వయంవరంలో శివ ధనుర్భంగం తర్వాత రాముడిని సవాల్ చేసే పరశురాముడి పాత్రలో కనిపంచనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్ర కాబట్టి ఈ రోల్‌ని ఎవరైనా స్టార్ హీరోతో చేయిస్తే బాగుటుందని అనుకున్నారు. ఫైనల్‌గా ఆ క్యారెక్టర్ చేసేందకు రామ్ చరణ్ అంగీకరించినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ Kతో పాటు ‘స్పిరిట్’ సినిమాలకు సైన్ చేశాడు. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ మూవీ చర్చల్లో ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adipurush movie, Bollywood, Prabhas, Tollywood

  తదుపరి వార్తలు