ఇప్పుడు ఇండస్ట్రీలో ‘సాహో’ గురించి చర్చ బాగా నడుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఒకేఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌ను నమ్మి రెండో సినిమాకే 200 కోట్ల బడ్జెట్ ఇచ్చేసారు యువీ క్రియేషన్స్. ఇప్పుడు వాళ్ల నమ్మకం నిలబెడుతూ ఈ కుర్ర దర్శకుడు కూడా కుమ్మేస్తున్నాడు. వాటన్నింటికీ సమాధానం ఒకేఒక్క మేకింగ్ వీడియోతో ఇచ్చాడు సుజీత్. ఆ మధ్య విడుదలైన "సాహో" మేకింగ్ హాలీవుడ్ తరహాలో ఉంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని మరో సీన్ గురించి చర్చ జరుగుతుంది.
ఇందులో ప్రభాస్ ఎంట్రీ సీన్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. దానికోసం దర్శకుడు సుజీత్ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఎంట్రీ సీన్ రాబరీ సీన్‌తోనే ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ధూమ్ 2’ సీన్స్ సైతం చిన్నబోయేలా ఈ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. ఈ కుర్ర దర్శకుడిపై ప్రభాస్ ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేస్తున్నాడు. 200 కోట్లు బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు.. కానీ టీం అంతా సుజీత్ తో నిలబడ్డారు.
"రన్ రాజా రన్"తో ఆకట్టుకున్న సుజీత్.. "సాహో"తో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ రాబరీ సీన్ కోసం ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్ సిటీలో నగల షాప్ సెట్ వేసారు. అక్కడే యూరప్ బ్యాక్ డ్రాప్ వచ్చేలా ప్లాన్ చేసి సీన్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు సుజీత్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తోనే బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ చూసిన తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఇతడి గురించి మాట్లాడుతున్నారు.
తెలుగులో ఇప్పటి వరకు విజువల్ గ్రాండియర్స్ ఎలా ఉంటాయో మన దర్శకులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. "సాహో" విడుదలైన తర్వాత తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ పార్ట్ గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటుంది. మరి చూడాలిక.. ఈ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ డ్రీమ్ ఎంతవరకు నెరవేరనున్నాయో..? మరి ఇంతగా ఊరిస్తున్న రాబరీ సీన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ హాట్ ఫోటోషూట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.