అవును.. ఇప్పుడు నిజంగానే తన ఎనర్జీతో షాక్ ఇస్తున్నాడు ప్రభాస్. సాధారణంగా ఈయన సినిమా అంటేనే యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. బాహుబలి సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇక ఇప్పుడు దాదాపు 200 కోట్లతో తెరకెక్కుతున్న సాహో కోసం కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు కూడా మరోసారి ఒళ్లు హూనం చేసుకోవడం కాదు ప్రాణం పెట్టేస్తున్నాడు ప్రభాస్. ఈయన కష్టాన్ని చూసి బాపురే.. ఈయనేంటి ఇలా ఉన్నాడు అంటూ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ కితాబు ఇస్తున్నాడు.
అసలు ప్రభాస్ లాంటి హీరోను ఇప్పటి వరకు తాను చూడలేదంటున్నాడు. ఎవరైనా హీరో యాక్షన్ సీన్స్ చేసిన తర్వాత కచ్చితంగా అలిసిపోతాడని.. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా ఉత్సాహంగా పని చేస్తున్నాడని చెబుతున్నాడు కెన్నీ. ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ఈయన వరస సినిమాలు చేస్తున్నాడు. ‘సాహో’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుందని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.
ఈ చిత్రీకరణలో భాగంగానే యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం హీరో, మిగిలిన నటులపై ముంబైలోని బాంద్రా బ్రిడ్జ్ మీద ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు సుజీత్. దీనికోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో కూడా యాక్షన్ సీన్స్ బాగానే ఉండబోతున్నాయి. ఇది లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు 30 శాతం పూర్తైపోయింది.
రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 1960ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమాను కూడా డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా రెండు సినిమాలకు యువీ క్రియేషన్స్ నిర్మాతలు కావడంతో పని ఇంకా ఈజీ అయిపోయింది. ఈ రెండు సినిమాలు 8 నెలల వ్యవధిలో విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి అభిమానుల కోసం యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood