• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS DOES NOT USE ANY APPS IN HIS PHONE HERE ARE THE DETAILS TA

Prabhas: ప్రభాస్ ఫోన్‌లో అలాంటివి ఏవి ఉండవట.. షాకింగ్ నిజాలు వెల్లడించిన దర్శకుడు..

Prabhas: ప్రభాస్ ఫోన్‌లో అలాంటివి ఏవి ఉండవట.. షాకింగ్ నిజాలు వెల్లడించిన దర్శకుడు..

ప్రభాస్ (File/Photo)

Prabhas | ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రాన్ని చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. తాజాగా ప్రభాస్ గురించి దర్శకుడు..

  • Share this:
    Prabhas | ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రాన్ని చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. అంతేకాదు బాహుబలితో బీ టౌన్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం  జూలై 30న విడుదల కానుంది. ఈ  సినిమా తర్వాత ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్ ఈ సినిమాను వచ్చే యేడాది 11 ఆగష్టు 2021లో రిలీజ్ కానుంది. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా ఉంది.

    ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్  ప్రకటించింది నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనే. కానీ ముందుగా ఈ ప్రాజెక్టులు మొదలు కానున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించాడు. టెక్నాలజీ పుణ్యామా ఇపుడు అందరు స్మార్ట్ ఫోెన్‌లు వాడుతున్నారు. కొత్త మోడల్ రాగానే సెలబ్రిటీలు పాతవి తీసేసి కొత్తవి వాడుతుంటారు. హీరో, హీరోయిన్లు కొత్త ఐఫోన్ రాగానే పాతవి ఓ మూలన పారేస్తుంటారు.  కానీ ప్రభాస్ మాత్రం గత ఐదారేళ్లుగా ఒక మోడల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పాడు. అంతేకాదు  ప్రభాస్ ఫోన్‌లకు దూరంగా ఉంటాడట. మరోవైపు తాను ప్రభాస్ కథ చెప్పడానికి వెళినపుడు కానీ.. ఆ తర్వాత పలు సార్లు కలిసినపుడు కానీ.. ప్రభాస్ పెద్దగా ఫోన్ వాడింది నేను చూడలేదున్నారు. అంతేకాదు ప్రభాస్‌కు వేరే వాళ్ల దగ్గర నుంచి కాల్స్ గట్రా వచ్చిన సంగతి తెలియదన్నారు. అంతేకాదు తాను ఇంత వరకు ప్రభాస్ చేతిలో ఫోన్ అనేది చూడలేదని నాగ్ అశ్విన్ సంచలన నిజాలు బయటపెట్టాడు.

    ప్రభాస్ విషయానికొస్తే..  సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫామ్  ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి. అందులో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండరనే సంగతి తెలిసిందే కదా.  ఏదో ప్రత్యేక సందర్భంలో తప్ప.. పెద్దగా ప్రభాస్ పోస్ట్ చేసిన ధాఖలాలు లేవు.   పైగా ప్రభాస్ ఫోన్‌లో పెద్దగా సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఉండవని అతని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి.

    గతేడాది ఉగాది సందర్భంగా చిరంజీవి కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యాడు. మరోవైపు నాగార్జున, బాలకృష్ణ కూడా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌‌ను చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. 60 యేళ్లు పై బడిన వీళ్లు యూజ్ చేయడం లేదంటే అర్దం ఉంది. యూత్ ఐకాన్‌గా ఉన్న ప్రభాస్.. సోషల్ మీడియా యాప్స్‌కు ఆమడ దూరంలో ఉండటం నిజంగానే విడ్డూరం అనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: