• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS DO YOU REMEMBER THIS BOLLYWOOD HEROINE WHO HAD A ROMANCE WITH REBEL STAR PRABHAS MOVIE TA

Prabhas: ప్రభాస్‌ సరసన నటించిన ఈ బీటౌన్ భామ ఎవరో గుర్తు పట్టారా..

Prabhas: ప్రభాస్‌ సరసన నటించిన ఈ బీటౌన్ భామ ఎవరో గుర్తు పట్టారా..

ప్రభాస్‌తో రొమాన్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో (Instagram/Photo)

ప్రభాస్‌తో రొమాన్స్ చేసిన ఈ బాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్... తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    Prabhas: ప్రభాస్‌తో రొమాన్స్ చేసిన ఈ బాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్... తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు చిన్నపుడు వాళ్లు ఎంత క్యూట్ ఉన్నారనే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తున్నారు. అటు  ఓ బాలీవుడ్ హీరోయిన్ తను స్కూల్లో డేస్‌లో ఎలా ఉండేదే తెలియజేస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ ‌లోని కొలంబోలో జన్మించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌ అని తెలిసిదే. జాక్వెలిన్.. సెక్సీ ఫిగర్‌తో, హాట్ హాట్ లుక్స్‌తో అదరగొడుతూ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

    ముందుగా మోడలింగ్‌తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో తన లక్‌‌ను పరీక్షించుకుంది. 2009లో ’అలాదిన్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’, ‘మర్ధర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2014లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘కిక్’ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ ‘సాహో’లో బ్యాడ్ బాయ్ పాటలో మెరిసి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఆ మధ్య కరోనా లాక్‌డౌన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఫామ్‌ హౌస్‌లో అతనితో కలిసి ఉంది. అప్పట్లో వీరిద్దరు కలిసి కొన్ని పాటలను కూడా షూట్ చేసారు. ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

    జాక్వెలిన్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు..  మహారాష్ట్రలోని పథార్డి, షకూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుంది. ఈ గ్రామాల్లోని 1500 మందికి పైగా ప్రజల సంరక్షణ బాధ్యతను ఆమె మూడేళ్లపాటు చూసుకోనుంది.  ఈ గ్రామాల్లో నివసిస్తోన్న ప్రజల పోషకాహారలోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ బాధ్యతను చేపట్టినట్లు తెలిపింది. అంతేకాదు పోషకాహార లోపం గురించి.. దాన్ని ఎలా ఎదుర్కోనాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి జాక్వెలిన్ పాల్‌ఘర్ అనే ఎన్ జి ఓ కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో నవజాత శిశువుల సంరక్షణ, పోషక ఆహార లోపం లేకుండా చిన్న పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పించే పనిలో ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు