HOME »NEWS »MOVIE »prabhas cute video with krishnam raju in his last birthday celebrations mnj

Krishnam Raju - Prabhas: పెదనాన్నను చిన్నపిల్లాడిలా రెడీ చేస్తున్న ప్రభాస్.. వీడియో చూశారా..!

Krishnam Raju - Prabhas: పెదనాన్నను చిన్నపిల్లాడిలా రెడీ చేస్తున్న ప్రభాస్.. వీడియో చూశారా..!
కృష్ణంరాజు, ప్రభాస్ (ఫైల్ ఫోటో)

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు(Krishnam Raju) బుధ‌వారం త‌న 80వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సినీ ప్ర‌ముఖులు మొద‌లు అభిమానులు కృష్ణంరాజుకు అభినంద‌న‌లు తెలిపారు

  • Share this:
    Krishnam Raju- Prabhas: రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు బుధ‌వారం త‌న 80వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సినీ ప్ర‌ముఖులు మొద‌లు అభిమానులు కృష్ణంరాజుకు అభినంద‌న‌లు తెలిపారు. ఇక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కృష్ణంరాజు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను కూడా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే కృష్ణంరాజు ఇంట్లో ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో కుటుంబ సభ్యులంద‌రూ పాల్గొన్నారు. ఇక పెద‌నాన్న బ‌ర్త్ డే కావ‌డంతో.. షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ప్ర‌భాస్.. ఇంటికి స‌మ‌యాన్ని కేటాయించాడు. కాగా కృష్ణం రాజు బ‌ర్త్ డే వేడుక‌ల్లో పాలు పంచుకొన్న ప్ర‌భాస్.. కృష్ణంరాజును రెడీ చేస్తూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అయితే ఆ వీడియో గ‌తేడాదిది అయిన‌ప్ప‌టికీ.. అభిమానులు మాత్రం దాన్ని షేర్ చేసుకుంటూ కృష్ణంరాజు- ప్ర‌భాస్ మ‌ధ్య ప్రేమ‌ను చూసి ఆనంద‌ప‌డుతున్నారు.

    కాగా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సెల‌క్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తోన్న కృష్ణంరాజు.. మ‌ళ్లీ ప్ర‌భాస్ మూవీలో క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ తెర‌కెక్కిస్తోన్న రాధే శ్యామ్‌లో కృష్ణంరాజు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో తాను ఆధ్యాత్మిక గురువు ప‌ర‌మ‌హంస పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని.. దానికి సంబంధించి ఇంకొంత భాగం షూటింగ్ మిగిలి ఉంద‌ని ఆయన తెలిపారు. అలాగే ఈ మూవీ ఏప్రిల్‌కి రానుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.




    అయితే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాధే శ్యామ్ తెర‌కెక్కుతోంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే తొలిసారి జ‌త క‌డుతోంది. భాగ్య శ్రీ, స‌చిన్ కేడ్క‌ర్, ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, కునాల్ క‌పూర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్, గోపీ కృష్ణ బ్యాన‌ర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published:January 21, 2021, 17:03 IST