Saaho: ‘సాహో’తో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ప్రభాస్..

‘సాహో’లో ప్రభాస్ (Youtube/Credit)

‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డు ‘సాహో’తో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  ‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డు ‘సాహో’తో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు సాధించలేనిది ఇపుడు ప్రభాస్ సాధించి చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ హిట్టు కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ తర్వాత ఆ స్థాయి హిట్ అన్నదే లేదు. మరోవైపు ఆమీర్ ఖాన్..‘దంగల్’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నా ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడం లేదు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్.. చెత్త రివ్యూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్న సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. కానీ తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. వరుసగా ‘బాహుబలి 1’, బాహుబలి 2’ తో పాటు తాజాగా ‘సాహో’తో వరుసగా రూ.400 కోట్లను అందుకున్న తొలి భారతీయ హీరోగా రికార్డులకు ఎక్కాడు.

  saaho movie proves prabhas becomes the first hero apart from shah rukh khan salman aamir to achiev hattrick 350 crore grossers,prabhas,salman khan,aamir khan,shah rukh khan,salman,prabhas on salman khan,shahrukh khan,prabhas on salman shahrukh aamir khan,shah rukh khan salman khan,prabhas bigger than shah rukh khan,shah rukh khan about aamir khan,prabhas funny reaction on salman shahruk aamir,shah rukh khan about salman khan,shah rukh khan about prabhas,shah rukh khan salman khan competition in bollywood,prabhas saaho movie,prabhas saaho movie collections,prabhas beats shah rukh salman aamir khan,prabhas bigger indian star,bollywood,tollywood,ప్రభాస్,ఆమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్,ప్రభాస్ షారుఖ్ ఖాన్ ఆమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్,ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్,ప్రభాస్,టాలీవుడ్,తెలుగు సినిమా,
  షారుఖ్,సల్మాన్,ఆమీర్, ప్రభాస్ (File/Photos)


  ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకు మాత్రమే పరిమితమైన వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా రాబట్టేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.400 కోట్లను రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా రన్ అవుతూనే ఉంది. కేవలం బాలీవుడ్‌లోనే రూ. 150 కోట్లను రాబట్టింది.  ఏమైనా ఒక తెలుగు హీరో అయివుండి.. జాతీయ స్థాయిలో ఈ రకమైన వసూళ్లతో బీటౌన్ హీరోలకు ప్రకంపనలు పుట్టిస్తున్నాడు ప్రభాస్. ఏమైనా ప్రభాస్ అందుకున్న ఈ ఫీట్‌కు నిజంగానే ‘సాహో’ అనాల్సిందే.
  First published: