• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS CRAZE IN PEAKS ITALY MEDIA SPECIAL COVERAGE ON PRABHAS RADHE SHYAM SHOOTING TA

Prabhas-Radhe Shyam: ఇటలీలో ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. అక్కడి మీడియాలో ‘రాధే శ్యామ్’ పై ప్రత్యేక కథనం..

Prabhas-Radhe Shyam: ఇటలీలో ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. అక్కడి మీడియాలో ‘రాధే శ్యామ్’ పై ప్రత్యేక కథనం..

‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ (Twitter/UV Creations/Photo)

Prabhas-Radhe Shyam : ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. అంతేకాదు ఈయన  సినిమాలను వివిధ దేశాల్లో కూడా విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. తాజాగా ఇటలీలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాపై అక్కడి మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

  • Share this:
    Prabhas Radhe Shyam : ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. అంతేకాదు ఈయన  సినిమాలను వివిధ దేశాల్లో కూడా విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో హీరోగా ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. రష్యా ,జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా బాహుబలి ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో పలకరించాడు. ఈ సినిమా తెలుగులో సరిగా ఆడలేదు. కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా ఇరగదీసింది. దాదాపు రూ. 200 కోట్లను కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా   ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా అక్కడి మీడియా ప్రభాస్.. రాధే శ్యామ్ షూటింగ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.


    రాధే శ్యామ్ సినిమాను దాదాపు  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విక్రమాదిత్యగా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Prabhas Radhe Shyam latest photos on the eve of prabhas birthday go viral on social media
    రాధే శ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే (Twitter/Photo)


    ‘రాధే శ్యామ్’ సినిమాకు రాధే శ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు ఈయన సంగీతం అందించాడు. ఇప్పటి వరకు భారీ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అయితే ఇతనకి లేదు కానీ రాధే శ్యామ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో ఇటలీ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న ఈ  సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు