పదిహేడేళ్ల ప్రస్థానం.. అందనంత ఎత్తుకు ఎదిగిన ప్రభాసనం..

రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజుతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి  17 సంవత్సరాలు అయ్యింది. ప్రభాస్ మొదట నటించిన చిత్రం 'ఈశ్వర్' విడుదలై ఈరోజుతో 17ఏళ్ళు పూర్తైంది.

news18-telugu
Updated: November 11, 2019, 12:09 PM IST
పదిహేడేళ్ల ప్రస్థానం.. అందనంత ఎత్తుకు ఎదిగిన ప్రభాసనం..
Twitter
  • Share this:
రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజుతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి  17 సంవత్సరాలు అయ్యింది. ప్రభాస్ మొదట నటించిన చిత్రం 'ఈశ్వర్' విడుదలై ఈరోజుతో 17ఏళ్ళు పూర్తైంది. దర్శకుడు జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు  స్క్రీన్ ప్లే, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు.  లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈశ్వర్ చిత్రం అప్పట్లో 100రోజులు ఆడింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర అనే సినిమాలో నటించాడు. అయితే  ప్రభాస్ ఆ తర్వాత నటించిన 'వర్షం' సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన 'ఛత్రపతి' మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్‌కు స్టార్ స్టేటస్‌తో మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. 
Loading...

View this post on Instagram
 

#Baahubali2: The conclusion was released 2 years ago, today. This day will be emotional to me, forever. I will always feel the gratitude for @ssrajamouli and the entire team. A big hug to all my fans for always being on my side. Thanks for supporting it and making it so big.


A post shared by Prabhas (@actorprabhas) on

ఆ తర్వాత ప్రభాస్ నటించిన... యోగి, మున్నా, బిల్లా, ఏక్ నిరంజన్ చిత్రాలు పరవాలేదనిపించాయి.  కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ మూవీతో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మారాడు. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైయాడు. ఇక మరోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రాలతో దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతేకాదు బాహుబలి సినిమాలు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. బాహుబలి సినిమాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన భారీ యాక్షన్ సినిమా  సాహోతో మరోమారు అభిమానులను తనదైన యాక్షన్ సీన్స్‌తో అలరించాడు.
అందాల విందు చేస్తోన్న నేహా శర్మ...
First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...