సాహోరే.. సైరా నరసింహారెడ్డితో అల్లూరి సీతారామరాజు పోజు భళా..

తెలుగు సినిమా స్థాయిని పెంచిన మూడు సినిమాలు.. ఆ ముగ్గురు కథానాయకులు.. ఒకే ఫ్రేములో కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది. ఇప్పుడు ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 5:14 PM IST
సాహోరే.. సైరా నరసింహారెడ్డితో అల్లూరి సీతారామరాజు పోజు భళా..
రామ్ చరణ్ ప్రభాస్ చిరంజీవి (Source: Twitter)
  • Share this:
తెలుగు సినిమా స్థాయిని పెంచిన మూడు సినిమాలు.. ఆ ముగ్గురు కథానాయకులు.. ఒకే ఫ్రేములో కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది. ఇప్పుడు ఇదే జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టానికి వేదికగా మారింది ముంబై. అక్కడే సాహో హీరో ప్రభాస్.. సైరా హీరో చిరంజీవి.. ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ కలిసి పోజిచ్చారు. ఈ ముగ్గుర్ని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు కూడా ఔరా అనుకుంటున్నారు. సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు రామ్ చరణ్, చిరంజీవి. ఇక అక్కడే సాహో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
Prabhas Chiranjeevi Ram Charan posed in a single fame after the event of Sye Raa Narasimha Reddy teaser launch pk తెలుగు సినిమా స్థాయిని పెంచిన మూడు సినిమాలు.. ఆ ముగ్గురు కథానాయకులు.. ఒకే ఫ్రేములో కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది. ఇప్పుడు ఇదే జరిగింది. sye raa,sye raa teaser,sye raa teaser launch,sye raa ram charan,sye raa chiranjeevi,prabhas saaho,saaho release date,rrr,rrr movie shooting,saaho promotions,saaho movie,prabha chiranjeevi ram charan,telugu cinema,రామ్ చరణ్,చిరంజీవి,ప్రభాస్,ప్రభాస్ సాహో,సైరా చిరంజీవి,సైరా టీజర్ లాంఛ్,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Twitter)

ఆగస్ట్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. సైరా ఈవెంట్ అయిపోయిన వెంటనే బయటికి వచ్చి ప్రభాస్‌ను కలిసాడు మెగాస్టార్. ఇక రామ్ చరణ్ కూడా ఫ్రేమ్‌లో ఉన్నాడు. సాహో సైరా అల్లూరి అంటూ సోషల్ మీడియాలో ఈ ముగ్గురి ఫోటో ఇప్పుడు వైరల్ అయిపోతుంది. పైగా తెలుగు సినిమా స్థాయిని మార్చేస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన హీరోలు ఇలా కనిపించడం అభిమానులను కూడా ఉత్సాహపరిచే విషయం.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>