Chatrapathi - Bhaswanth Vamsi: ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో అనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వారిని ఏదైనా న్యూస్ పేపర్లలో కనిపిస్తే తప్ప ఇలాగ ఉన్నారని మనకు తెలిసేది కాదు. అయితే ప్రస్తుతం అలా కాదు... సోషల్ మీడియా బాగా డెవలప్ కావడంతో చైల్డ్ ఆర్టిస్టులందరూ ప్రత్యేక పేజ్ క్రియేట్ చేసి వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానుల సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన "చత్రపతి" సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సూరీడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చత్రపతి సినిమా కోసం ప్రభాస్ తన బాడీ లుక్ మొత్తం మార్చుకొని బాక్స్ ఆఫీసు వద్ద నిర్మాతలకు లాభాలను కురిపించాడు. ప్రభాస్ సినీ చరిత్రలో అత్యధిక సెంటర్లలో సెంచరీ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది చత్రపతి సినిమా అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో సూరీడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.కనిపించింది కొన్ని సీన్లలో అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దారు జక్కన్న. చత్రపతి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు భస్వంత్ వంశీ. ఇక ఈ సినిమాలు కాట్రాజు సీన్లో భస్వంత్ అలియాస్ సూరీడు పాత్ర ఎంతగానో ప్రేక్షకుల హృదయాలను కలచివేసింది. ఈ సినిమాలో ఈ సన్నివేశం ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి బాగా సహాయపడింది.
చత్రపతి సినిమా తరువాత ఎక్కువగా సినిమాలలో కనిపించని భస్వంత్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే విదేశాలలో చదువులు పూర్తి చేసుకుని వచ్చిన భస్వంత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే భస్వంత్ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhaswanth Vamsi, Chatrapathi, Prabhas, Tollywood