బీటౌన్ స్టార్ హీరోతో ప్రభాస్ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌.. దర్శకుడు అతడేనా..

ప్రభాస్ (Prabhas)

తాజాగా యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ అది కూడా వేరే హీరోతో మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

 • Share this:
  బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాకు నెగిటిల్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా రూ. 400 కోట్లు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో అందిరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అనుకున్నంత రేంజ్‌లో లేదని ప్రభాస్ ఫ్యాన్స్  బహిరంగంగా విమర్శలు కూడా చేసారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణే నటిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ‌పై క్రేజ్ ఆకాశాన్ని అంటింది.

  Deepika Padukone, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,deepika padukone,prabhas movie,prabhas action,deepika padukone prabhas,deepika padukone movies,deepika padukone new movie,baahubali prabhas,ప్రభాస్, దీపికా పదుకొనే
  ప్రభాస్, దీపికా Photo : Twitter


  ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్.. ఇప్పటి నుంచి యేడాదికి మినిమం రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో  ‘రాధే శ్యామ్’ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీకి ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా పట్టాలెక్కనుంది. తాజాగా ప్రభాస్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

  ప్రభాస్, హృతిక్ రోషన్ (File/Photo)


  ఈ చిత్రాన్ని ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారట. అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే యేడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: