news18-telugu
Updated: March 3, 2020, 1:45 PM IST
సాహో పోస్టర్ (Saaho poster)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తనతో సాహో సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రద్ధా కపూర్‌కు ఇన్స్టాగ్రామ్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఈ సందర్భంగా ఆమెతో నటించిన ‘సాహో’ సినిమాలోని పిక్‌ను షేర్ చేసాడు. అంతేకాదు సాహో సినిమాలో అమృతగా నటించిన శ్రద్ధా కపూర్ వెరీ హ్యాపీ బర్త్ డే అని చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఒకే చెప్పాడు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కనుక సంభవిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. మరోవైపు శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ‘బాఘీ 3’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంపై శ్రద్ధా కపూర్ భారీ ఆశలే పెట్టుకుంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 3, 2020, 1:34 PM IST