Home /News /movies /

PRABHAS BIG UNCLE REBER STAR KRISHNAM RAJU WILL PLAY IMPORTENT ROLE IN ADIPURUSH TA

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌లో కీలకపాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ?

పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Twitter/Photo)

పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Twitter/Photo)

Adipurush Prabhas Krishnam Raju | ఆదిపురుష్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    Prabhas Adipurush: బాహుబలి తర్వాత ప్రభాస్.. కేవలం ‘సాహో’ కోసం రెండేళ్లు కేటాయించాడు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. అంతేకాదు ఇకపై గ్యాప్ రాకూడనే ఉద్దేశ్యంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకున్న కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ లేటయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభాస్.. ‘రాధేశ్యామ్’ సినిమాను చేస్తూనే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఢీ కొట్టే లంకేషుడు అదేనండి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ  ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్.. సరసన హీరోయిన్లుగా కీర్తి సురేష్, కియారా అద్వానీ, అనుష్క శర్మ  పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరినీ ఫైనల్ చేస్తారో చూడాలి.

    Prabhas Big Uncle Reber Star Krishnam Raju will Play importent role in Adipurush,prabhas,Prabhas krishnam raju,krishnam raju play dasharadha,krishnam raju play dasharatha prabhas twitter,prabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,కృష్ణంరాజు,ప్రభాస్ కృష్ణంరాజు,దశరథుడి పాత్రలో కృష్ణంరాజు
    పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Twitter/Photo)


    మరోవైపు ఆదిపురుష్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్..శ్రీరామచంద్రుడి తండ్రి దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కృష్ణంరాజు.. ‘రాధేశ్యామ్’లో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. హీరోగా నటుడిగా కృష్ణంరాజు గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటికే పలు పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటిస్తే.. బాగానే ఉంటుందనేది ప్రభాస్ అభిమానుల అభిప్రాయం. కృష్ణంరాజు నటించే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

    Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌లో కీలకపాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ?
    ఆదిపురుష్‌లో రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ?


    మరోవైపు ఈ చిత్రంలో విశ్వామిత్రుడిగా మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నారు. మిగిలిన పాత్రల కోసం ఆయా భాషల్లో ఫేమసైన నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. రామాయణ గాథ తెరకెక్కించాలంటే ఎంతో మంది ఆర్టిస్టులు కావాలి. దీంతో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anushka Sharma, Bollywood, Krishnam Raju, Om Raut, Prabhas, Saif Ali Khan, Tollywood

    తదుపరి వార్తలు