ప్రభాస్ డేరింగ్ డెసిషన్.. .బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇస్తున్న బాహుబలి...

తను ప్రస్తుతం చేయబోతున్న జాన్ సినిమాను కేవలం తెలుగు వరకు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 10, 2019, 4:03 PM IST
ప్రభాస్ డేరింగ్ డెసిషన్.. .బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇస్తున్న బాహుబలి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌కి షాక్ ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రభాస్ గత రెండు సినిమాలు బాహుబలి, సాహో బాలీవుడ్‌లో కూడా రిలీజ్ అయ్యాయి. బాహుబలి సంచలన విజయాన్ని నమోదు చేస్తే.. సాహో ఫర్వాలేదనిపించింది. అయితే, తను ప్రస్తుతం చేయబోతున్న జాన్ సినిమాను కేవలం తెలుగు వరకు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న జాన్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి, సాహో తరహాలో ఇందులో భారీ సెట్లు, యాక్షన్ సీన్లు లేదు. ఓ రొమాంటిక్ సినిమాగా రానుంది. పాటలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని సమాచారం.

బాహుబలి సినిమాను చూసిన హిందీ అభిమానులు ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అయ్యారు. ఆ తర్వాత సాహో సినిమా కూడా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్‌ను ఊహించుకున్న అభిమానులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఉద్దేశంతో ప్రభాస్ ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాను కేవలం తెలుగు వరకే పరిమితం చేసే యోచనలో ఉన్నాడు. దీంతోపాటు బాహుబలి, సాహో సినిమాల ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ తన సొంత గడ్డను పట్టించుకోలేదని, తెలుగు వారిని నిర్లక్ష్యం చేశాడనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ జాన్ సినిమాను బాలీవుడ్‌కు తీసుకెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...