ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ.. ఇంతకీ ఎపుడంటే..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్ర‌భాస్ పెళ్లి. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియ‌ల్స్ కంటే జీడిపాకంలా సాగుతూనే ఉంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 27, 2019, 9:01 AM IST
ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ.. ఇంతకీ ఎపుడంటే..
కృష్ణం రాజు,ప్రభాస్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్ర‌భాస్ పెళ్లి. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియ‌ల్స్ కంటే జీడిపాకంలా సాగుతూనే ఉంది. ఏళ్ల‌కేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. ఆ శుభవార్త చెబుతాడని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు భావించారు. ఆ తర్వాత తూచ్ అంటూ ప్రభాస్.. పెళ్లి మాటే మర్చిపోయి.. ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా వచ్చి వెళ్లిపోయింది కూడా. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఎప్పటి కప్పుడు ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు. ఎలాంటి అమ్మాయిని చేసుకుంటాడనే దానిపై పూటకో వార్త చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ మధ్య తనతో సినిమాలు చేసిన అనుష్క‌ను త్వరలో పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వెలుబడ్డాయి.

prabhas big mother clarifies about his young star marriage,prabhas marraige,prabhas twitter,prabhas marraige news,prabhas marraige photos,prabhas marraige shyamala devi,prabhas anushka shetty marriage,prabhas anushka shetty,prabhas marriage announcement,prabhas marriage date Confirmed,krishnam raju on prabhas marriage,prabhas saaho teaser,prabhas saaho release date,prabhas marriage anushka shetty,prabhas krishnam raju shyamala devi,telugu cinema,prabhas marriage after saaho,ప్రభాస్ పెళ్లి,ప్రభాస్ పెళ్లి న్యూస్,ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి,ప్రభాస్ పెళ్లి సాహో,రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రభాస్,బాహుబలి 2 ప్రభాస్,తెలుగు సినిమా,
పెదనాన్న, పెద్దమ్మలతో ప్రభాస్ (File/Photo)


తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్.. జాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిదే కదా. వచ్చే యేడాది ఈ చిత్రం పూర్తవగానే ప్రభాస్ పెళ్లి పీటలెక్కుతాడని ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులే కాదు.. మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇక ప్రభాస్ పెళ్లి కూతరు విషయంలో మీడియాలో వచ్చే వార్తలు చూసి మేము ఎంజాయ్ చేస్తుంటాము. మా కుటుంబంలో కలిసిపోయే తగిన అమ్మాయి కోసం చూస్తున్నామని శ్యామలా దేవి పేర్కొన్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 27, 2019, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading