ప్రభాస్ సంచలనం.. పవన్ కళ్యాణ్‌ను మించిన విరాళం..

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈయనే నెంబర్ వన్ హీరో. సమీపంలో కూడా బాహుబలిని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 11:20 PM IST
ప్రభాస్ సంచలనం.. పవన్ కళ్యాణ్‌ను మించిన విరాళం..
ప్రభాస్ భారీ విరాళం (Prabhas Saaho)
  • Share this:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈయనే నెంబర్ వన్ హీరో. సమీపంలో కూడా బాహుబలిని కొట్టే సినిమా మరేదీ కనిపించడం లేదు. ఆ తర్వాత సాహో కూడా హిందీలో సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన ఫారెన్ షూటింగ్ నుంచి వచ్చి హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. ఇక ఇప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా విరాళం అందించాడు ప్రభాస్.

ప్రభాస్ మోదీ (Source: Facebook)
ప్రభాస్ మోదీ (Source: Facebook)


అది కూడా అంతా ఇంతా కాదు.. ఏకంగా 3 కోట్ల రూపాయలను ప్రభాస్ అనౌన్స్ చేసాడు. ఉత్తరాది ప్రేక్షకులు బాహుబలి రూపంలో తనను ఎంతగానో ఆదరించారని ప్రభాస్‌కు తెలుసు. అందుకే ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేసాడు యంగ్ రెబల్ స్టార్. ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్‌కు 3 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు ప్రభాస్. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే ఇంత భారీగా విరాళం అందించిన హీరో ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. దానికి రెండింతలు విరాళం ప్రకటించి సంచలనం సృష్టించాడు ప్రభాస్.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు