బాహుబలికి అరుదైన గౌరవం.. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో తెలుగు సినిమా..

తెలుగు సినిమా బాహుబలి విడుదలైనప్పటి నుండి రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. తాజాగా బాహుబలి సినిమాకు ఓ గొప్ప గౌరవం దక్కింది.

news18-telugu
Updated: October 20, 2019, 11:12 AM IST
బాహుబలికి అరుదైన గౌరవం.. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో తెలుగు సినిమా..
Twitter
  • Share this:
తెలుగు సినిమా బాహుబలి విడుదలైనప్పటి నుండి రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. తాజాగా బాహుబలి సినిమాకు ఓ గొప్ప గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ థియేటర్‌లో బాహుబలి ది బిగినింగ్ మూవీని ప్రదర్శించారు.  దీని కోసమే బాహుబలి టీమ్ లండన్ చేరుకోవడం జరిగింది. హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, దర్శకదీరుడు రాజమౌళి నిర్మాత శోభు యార్లగడ్డ  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిత్రాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో మూవీ ప్రదర్శించడం అంటే అదో పెద్ద గౌరవంగా భావిస్తారు సినీ జగత్. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం కొన్ని చిత్రాలను ఎంచుకుని ఈ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శిస్తారు. అందులో భాగంగా.. ఈ ఏడాదికిగాను ఇక్కడ ప్రదర్శనకు మూడు చిత్రాలు ఎంపిక కాగా, వాటిలో బాహుబలి బిగినింగ్ ఉండగా... మిగితా రెండు చిత్రాల్లో స్కై ఫాల్, హ్యారి పోటర్‌లు ఉన్నాయి.
 View this post on Instagram
 

TheMIGHT , TheMAJESTY, TheMAHISHMATI!! #BaahubaliTheBeginningLive #royalalberthall


A post shared by Rana Daggubati (@ranadaggubati) on

అయితే రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా ప్రదర్శనతో పాటు ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి అద్వర్యంలో మ్యూజికల్ షో కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోస్ ఈ సందర్భంగా ప్రభాస్‌, రాజమౌళి, రానా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 
View this post on Instagram
 

The best evening with the best people!! ❤️


A post shared by Rana Daggubati (@ranadaggubati) on
Janhvi Kapoor : శ్రీదేవికి ఏమాత్రం తగ్గని అందంతో కేక పుట్టిస్తోన్న జాన్వీ..

First published: October 20, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading