• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS ANNOUNCE ADIPURUSH MOVIE ON RAMAYANA AFTER ALLU ARAVIND GET DISAPPOINTED THESE ARE THE REASONS TA

Prabhas Allu Aravind: ప్రభాస్ దెబ్బకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విల విల..

Prabhas Allu Aravind: ప్రభాస్ దెబ్బకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విల విల..

ప్రభాస్, అల్లు అరవింద్ (File/Photo)

Prabhas Allu Aravind | ప్రభాస్ దెబ్బకు ఇపుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విలవిల లాడిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

  • Last Updated:
  • Share this:
    Prabhas Allu Aravind | ప్రభాస్ దెబ్బకు ఇపుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విలవిల లాడిపోతున్నారు. వివరాల్లోకి వెళితే...ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి టాక్ ఆఫ్ ది ఇండియన్ మూవీ అయింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై పూటకో అప్‌డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు.  మరోవైపు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్టు వార్తులు వస్తున్నాయి. మరోవైపు విశ్వామిత్రుడిగా మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నారు. వీళ్లిద్దరు తప్ప ఇక మిగతా నటీనటులను ఆయా ఇండస్ట్రీలో ఫేమసైన వాళ్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

    Prabhas Adipurush shooting starts with this scenes here are the details,prabhas,prabhas twitter,prabhas adipurush movie,prabhas Adipurush saif ali khan,saif ali khan lankesh adipurush,mohan babu prabhas,prabhas mohan babu adipurush,adipurush prabhas kiara advani,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్,సైఫ్ అలీ ఖాన్,ఆదిపురుష్‌లో లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్,ఆదిపురుష్‌లో మోహన్ బాబు,మోహన్ బాబు ప్రభాస్ ఆదిపురుష్
    ప్రభాస్ ఆదిపురుష్‌Photo : Twitter


    మరోవైపు ఈ సినిమాలో సీత పాత్రలో అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ చిత్రంలో రావణాసుడి భార్య మండోదరి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రలో శ్రియ పేరును పరిశీలిస్తున్నారు. ఐతే.. ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెనలతో కలిసి మరోసారి రామాయణ గాథను  భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. మొదటి భాగాన్ని 2021లో విడుదల చేయనున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో రాముడు,రావాణాసురుడగా ఆ హీరో నటిస్తున్నట్టు వార్తులు వచ్చినా.. ఆ తర్వాత ఈ చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ లేదు.

    ప్రభాస్, అల్లు అరవింద్ (File/Photo)


    ఇక రామాయణం లాంటి గాథకు ఎలాంటి పేటెంట్ హక్కులు లేవు. ఎవరైనా తెరకెక్కించవచ్చు. పౌరాణిక, చారిత్రక కథలకు కాపీ రైట్ హక్కులు లాంటివి ఉండవు కాబట్టి ఎవరైనా ఈ కథతో సినిమాను తెరకెక్కించవచ్చు. మరి ప్రభాస్ అట్టహాసంగా రామాయణ కథపై ఆదిపురుషుడు శ్రీరామచంద్రుడిపై ’ఆది పురుష్’ సినిమా ప్రకటించిన ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ .. రామాయణ గాథను తెరకెక్కించే సాహసం చేస్తాడా ? ఒకవేళ చేసినా.. ప్యాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే ప్రభాస్ తరహా హీరో కావాలి. తెలుగులో మిగతా స్టార్ హీరోలున్న ప్రభాస్‌లా ప్యాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ ఎవరికీ లేదనే చెప్పాలి.

    Prabhas announce adipurush movie on ramayana after allu aravind get disappointed these are the reasons,prabhas,Allu Aravind,Prabhas Allu Aravind,Prabhas Adipurush allu aravind ramayanam,Prabhas krishnam raju,Prabhas adipurush mm keeravani,Prabhas Adipurush MM keeravani music direction,mm keeravani,mm keeravani to music adipurush,krishnam raju play dasharadha,krishnam raju play dasharatha prabhas twitter,prabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,కృష్ణంరాజు,ప్రభాస్ కృష్ణంరాజు,దశరథుడి పాత్రలో కృష్ణంరాజు,కీరవాణి,ఎంఎం కీరవాణి,ప్రభాస్ ఆదిపురుష్ కీరవాణి,ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు కీరవాణి సంగీతం,ప్రభాస్ అల్లు అరవింద్,అల్లు అరవింద్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్,ప్రభాస్ అల్లు అరవింద్ ఆదిపురుష్ రామాయణం
    ప్రభాస్, అల్లు అరవింద్ (File/Photo)


    ఇపుడు చేసే సినిమాలతోనైనా ఆ ఇమేజ్ తెచ్చుకుంటారా అనేది చూడాలి.  ఒక రకంగా బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ క్రేజ్ ముందు చిన్నబోతున్నరనే చెప్పాలి. మొత్తంగా అల్లు అరవింద్ తెరకెక్కించాలను రామాయణం సినిమా ఆశలపై ఇపుడు ప్రభాస్ నీళ్లు చల్లాడనే చెప్పాలి. లేకపోతే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ధీటుగా తాను తీయాలనుకున్న రామాయణాన్ని తెరకెక్కిస్తాడా అనేది చూడాలి. మరోవైపు అప్పట్లో మంచు ఫ్యామిలీ మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రావణబ్రహ్మ’ సినిమాను అనౌన్స్ చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు