Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్‌కు కుదిరిన ఓటీటీ డీల్.. జీ5లో ప్రసారం..

రాధే శ్యామ్ (radhe shyam) Photo : Twitter

Prabhas | Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డే ప్రేమకావ్యం రాధేశ్యామ్‌కు ఓటీటీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఒక్క హిందీలో తప్ప అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది.

  • Share this:
    Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తోంది. దీనికి తోడు సాహో సినిమా తర్వాత.. ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది కావడంతో మంచి అంచనాలున్నాయి. ఈ రాధే శ్యామ్ సినిమాను కూడా సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్‌లో ప్రభాస్ సూపర్ కూల్ లుక్‌లో అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ లోని మాస్ నే చూసారు ఇప్పుడు అతనిలో ప్రేమను చూడండి అంటూ ఒక ప్రీ టీజర్ తో టీజ్ చేశారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఓటిటి డీల్స్ నడుస్తున్నాయని బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తాజా సమాచారం. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది.

    ఇక మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షూట్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)





    ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించనుంది. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: