హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas | Radhe Shyam : షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్.. సంక్రాంతి బరిలో ప్రభాస్..

Prabhas | Radhe Shyam : షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్.. సంక్రాంతి బరిలో ప్రభాస్..

హీరోలలో పాన్ ఇండియన్ స్టార్ ఎవరంటే మరో అనుమానం లేకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈయనకు తెలుగుతో పాటు హిందీలోనూ అదిరిపోయే మార్కెట్ ఉంది. దానికితోడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు. మరి పాన్ ఇండియన్ హీరోయిన్ ఎవరంటే ఏం చెప్పాలి..? దానికి కూడా సమాధానం ఉంది.. ఆ పేరు పూజా హెగ్డే.

హీరోలలో పాన్ ఇండియన్ స్టార్ ఎవరంటే మరో అనుమానం లేకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈయనకు తెలుగుతో పాటు హిందీలోనూ అదిరిపోయే మార్కెట్ ఉంది. దానికితోడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు. మరి పాన్ ఇండియన్ హీరోయిన్ ఎవరంటే ఏం చెప్పాలి..? దానికి కూడా సమాధానం ఉంది.. ఆ పేరు పూజా హెగ్డే.

Prabhas: ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్స్‌గా వస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

  Prabhas: ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్స్‌గా వస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తోంది. దీనికి తోడు సాహో సినిమా తర్వాత.. ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది కావడంతో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్‌లో ప్రభాస్ సూపర్ కూల్ లుక్‌లో అదరగొడుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది.


  ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.

  ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాకు హిందీ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించనుంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా సలార్. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas, Tollywood news

  ఉత్తమ కథలు