Bhediya Trailer Review: ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan). ఎపుడు రొటిన్ సినిమాలే కాకుండా.. కాస్త విభిన్నంగా కొత్తగా ట్రై చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈయన నటించిన కొత్త సినిమా బేడియా. అంటే తెలుగులో తోడేలు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. ఈ సినిమా తెలుగు లో "తోడేలు" పేరు తో రాబోతుంది. కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ (Jio Studious) సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. భారతీయ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. ఈ చిత్ర ట్రైలర్ బాగుందంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్స్ కత్రీనా కైఫ్, అనుష్క శర్మ, వికీ కౌశల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ట్రైలర్ తమకెంతో నచ్చిందని, సినిమా మేకింగ్ క్వాలిటీ వరల్డ్ క్లాస్ గా ఉందని వారు అప్రిషియేట్ చేశారు. బేడియా అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు టాప్ గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ చేశాయి.
Bimbisara OTT Streming: జీ 5 ఓటీటీలో నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ స్ట్రీమింగ్..
పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది నవంబర్ 25న బేడియా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్రీడీ ఫార్మేట్ లోనూ ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.దినేష్ విజాన్ నిర్మాత. హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లవుతున్న సందర్భంగా "తోడేలు" ట్రైలర్ ను విడుదల చేశారు. బేడియా హిందీ తెలుగు తమిళ భాషల్లో నవంబర్ 25న రిలీజ్ అవ్వనుంది.
అరుణాచల్ అడవుల నేపథ్యంగా బేడియా కథ సాగుతుంది. ఇక్కడి వైల్డ్ యానిమల్ గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు.అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు టాప్ గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhediya Movie, Bollywood news, Prabhas, Tollywood, Varun Dhawan