మేం రెడీ అంటున్న ప్రభాస్, అనుష్క..

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే వినిపించే పేర్లు.. ప్రభాస్, అనుష్క. బ్యాచిలర్ అనే కాదు.. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్లు ఎందరో ఉన్నారు.

news18-telugu
Updated: October 31, 2019, 7:36 PM IST
మేం రెడీ అంటున్న ప్రభాస్, అనుష్క..
ప్రభాస్ అనుష్క శెట్టి ఫైల్ ఫోటో
  • Share this:
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే వినిపించే పేర్లు.. ప్రభాస్, అనుష్క. బ్యాచిలర్ అనే కాదు.. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లలో సినీ ప్రముఖుల నుంచి ప్రేక్షకుల వరకు జాబితా పెద్దగానే ఉంది. బిల్లా సినిమా మొదలు బాహుబలి రెండో పార్టు వరకు ప్రభాస్, అనుష్క స్క్రీన్‌పై కనిపించగానే చూడముచ్చని జంట అని మురిసిపోయే వాళ్లు ఇంకెందరో ఉన్నారు. అవును.. నిజంగానే వీళ్లిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపిస్తారు. అప్పట్లో వీళ్లిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గాసిప్స్ వినిపించాయి. కానీ, అవన్నీ పుకార్లేనని ప్రభాస్, అనుష్క కొట్టిపడేశారు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. తాజాగా.. బాహుబలి బృందం లండన్ వెళ్లింది. ఆ బృందంలో ప్రభాస్, అనుష్క కూడా ఉన్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పక్క పక్క సీట్లలోనే ప్రభాస్, అనుష్క కూర్చున్నారు. దీంతో వీరి ప్రేమాయణానికి సంబంధించి వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

ఇదిలా ఉండగా, బాహుబలి చిత్రం ప్రదర్శించిన అనంతరం వేదిక వద్ద ఉన్న మీడియా ప్రభాస్, అనుష్కను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు.. ప్రభాస్, అనుష్కలకు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని అడగ్గా.. ప్రభాస్ మాట్లాడుతూ తనకు భాషతో సంబంధం లేదని, మంచి స్క్రిప్టు ఉంటే నటిస్తానని చెప్పాడు. అటు అనుష్క కూడా.. ప్రపంచంలోని అన్ని భాషల్లో నటించాలని ఉందని స్పష్టం చేసింది. అంటే.. హాలీవుడ్‌లో అవకాశం వస్తే వెంటనే రెడీ చెప్పేయాలన్న ఆత్రుతతో వీరిద్దరు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
First published: October 31, 2019, 7:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading