Prabhas | Project K : ప్రాజెక్ట్ K సినిమాకు ప్రభాస్ బల్క్ డేట్స్.. అదిరిన నాగ్ అశ్విన్ ప్లాన్....

Prabhas allots bulk dates for Nag Ashwin Project K Photo : Twitter

Prabhas | Project K : ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఇటీవల గురుపూర్ణిమా సందర్భంగా ప్రాజెక్ట్ K అనే భారీ సినిమా మొదలైన సంగతి తెలిసిందే.

  • Share this:
    ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఇటీవల గురుపూర్ణిమా సందర్భంగా ప్రాజెక్ట్ K అనే భారీ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా ప్యాన్ వరల్డ్ లెవల్లో వస్తోంది. ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.  ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ఈరోజు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నాడు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

    ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

    ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ మొదలైన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: