ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 18, 2019, 8:28 AM IST
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..
పీఎం నరేంద్ర మోదీతో ప్రభాస్ (Facebook/Photo)
  • Share this:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగునాట ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.  ఆ తర్వాత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో  ‘యాత్ర’ సినిమా వచ్చింది.  మరో వైపు మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఇంకోవైపు వివేక్ ఓబరాయ్ హీరోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.తాజాగా మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితంపై మరో బయోపిక్‌ తెరకెక్కుతుంది. హిందీ,ఇంగ్లీష్,తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్‌ను మోదీ పుట్టినరోజు సందర్భంగా  ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసారు.  అంతేకాదు ఓ ప్రత్యేక వ్యక్తికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఒక ప్రత్యేక మైన రోజున విడుదల చేస్తుందనందకు ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ప్రధాని మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్ కలిసి ఈ బయోపిక్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు ఇంగ్లీష్,తెలుగు,తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రలో అభయ్ వర్మ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. హిందీలో ‘మన్ బైరాగి’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘మనో విరాగి’ పేరును ఖరారు చేసారు. ఈ సినిమాను సంజయ్ త్రిపాఠి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మోదీ యువకుడి ఉన్నపుడు ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమా పోస్టర్‌ ఉంది. హిందీలో అక్షయ్ కుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.
మరోవైపు దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడుతూ.. మనందరికీ తెలిసిన ప్రధాని జీవితంలో ఎవరికీ తెలియని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రేసుగుర్రం విలన్ రవికిషన్ కూడా ప్రధానమంత్రి బయోపిక్‌ను భోజ్‌పురిలో తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే
Published by: Kiran Kumar Thanjavur
First published: September 18, 2019, 8:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading