PRABHAS ADIPURUSH UPDATE RELEASE DATE CONFIRMED BY THE MAKERS HERE ARE THE DETAILS SR
Prabhas Adipurush Update : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ విడుదల ఆరోజే.. చిత్రబృందం అధికారిక ప్రకటన..
ఆదిపురుష్ Photo : Twitter
Prabhas Adipurush Update : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో భాగంగా ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ యాక్షన్ మూవీ 2021 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై వస్తోన్న ఊహాగానాలకు తెరపడింది. ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా అన్నారు. కాగా తాజా సమాచారం మేరకు మన టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన టాల్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈమెనే ప్రభాస్ కు సరసన మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
PRABHAS - SAIF ALI KHAN... #Adipurush [3D] release date finalized: 11 Aug 2022 [Thursday]... Stars #Prabhas and #SaifAliKhan... Directed by #OmRaut... Produced by Bhushan Kumar, Krishan Kumar, Om Raut, Prasad Sutar and Rajesh Nair... Filming starts Jan 2021. #Prabhas22pic.twitter.com/7dYSQvlxKc
మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో సైఫ్ చేస్తున్న రెండో సినిమా ఇది. గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్ కోసం వారిద్దరూ కలిసి పనిచేశారు. ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా తీయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు. అంతేకాక ఆయన విలువిద్య నేర్చుకుంటున్నాడన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. తన రాబోయే చిత్రం రాధే శ్యామ్‌లో పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.