Prabhas Adipurush Update : ప్రభాస్‌కు జోడిగా కృతి సనన్.. అధికారిక ప్రకటన..

Prabhas Adipurush Update Photo : Twitter

Prabhas Adipurush Update : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్యాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.

 • Share this:
  రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్యాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో భాగంగా ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పౌరాణిక గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా అన్నారు. కాగా తాజాగా సీత పాత్రపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా కృతి సనన్ నటిస్తుందని చిత్ర దర్శకుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. క‌ృతి సనన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ వన్ నేనోక్కడినే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌కు సోదరుడిగా.. అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ విషయంలో కూడా చాలా రూమర్స్ వినపడ్డాయి. తాజాగా ఈ పాత్రలో ఓ హిందీ నటుడుని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆ రోల్‌కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు ఖరారు చేసింది చిత్రబృందం. సన్నీ సింగ్ “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించాడు. ఇక మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో సైఫ్ చేస్తున్న రెండో సినిమా ఇది. గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్ కోసం వారిద్దరూ కలిసి పనిచేశారు.

  ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ యాక్షన్ మూవీ ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది. అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.


  ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా.. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు. అంతేకాక ఆయన విలువిద్య నేర్చుకుంటున్నాడన్నారు. పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు. వీటితో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెండు షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేసుకుంది. శృతి హాసన్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: