హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas : ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌కు తల్లిగా అందాల హీరోయిన్.. పిచ్చేక్కిపోతున్న ఫ్యాన్స్..

Prabhas : ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌కు తల్లిగా అందాల హీరోయిన్.. పిచ్చేక్కిపోతున్న ఫ్యాన్స్..

ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas : స్టార్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను ప్రకటిస్తూ అదరగొడుతున్నాడు.

  స్టార్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను ప్రకటిస్తూ అదరగొడుతున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా కేజీయఫ్‌తో సూపర్ పాపులరైనా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో స‌లార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ‌లోని గోదావ‌రి ఖ‌ని జిల్లాలో జరుగుతోంది. ప్రభాస్ ఈ సినిమాతో మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్నారు. ఫిబ్ర‌వరిలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా మోషన్ క్యాప్చర్ మొదలైందని ప్రకటించాడు దర్శకుడు ఓం రౌత్. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభాస్ దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈరోజు మోషన్ క్యాప్చర్ మొదలైంది. ఇక ఫిబ్రవరి 2న ముహూర్తం అని తెలిపాడు. అంటే మైథ‌లాజిక‌ల్ మాగ్న‌మ్ ఓప‌స్ ప్రాజెక్టు ఆదిపురుష్ వచ్చే నెలలో ప్రారంభంకానుందని తెలుస్తోంది.

  పౌరాణిక గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

  hema malini condemns the rumours that her Tested Positive For Covid-19 Latter Shares Video Update,hema malini,hema malini health condition,hema malini corona possitive,hema malini twitter,hema malini instagram,amitabh bachchan corona possitive,amitabh family corona possitive,hema malini facebook,hema malini clarity about her health,hema malini,balakrishna,hema malini balakrishna,hema malini balakrisha Gautamiputra Satakarni,Gautamiputra Satakarni,happy birthday,hema malini songs,hema malini movies,happy birthday hema malini,hema malini biography,hema malini happy birthday,hema malini birthday celebration,hema malini 70th birthday celebrations,hema malini dance,hema malini interview,hema malini birthday 2018,hema malini birthday special,hema malini celebrates birthday,hema malini family,hema malini celebrate her birthday,tollywood,bollywood,హేమా మాలిని,హేమా మాలిని పుట్టినరోజు,హ్యాపీ బర్త్ డే హేమా మాలిని,హేమా మాలిని గౌతమిపుత్ర శాతకర్ణి,గౌతమిపుత్ర శాతకర్ణి,హేమా మాలినికి కరోనా పాజిటివ్,హేమా మాలిని కరోనా,హేమా మాలిని కరోనా పాజిటివ్,హేమా మాలిని కరోనా పాజిటివ్ ఖండించిన నటి
  హేమా మాలిని (File Photo)

  ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆ రోల్‌కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపిస్తుంది. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా కనిపించనున్నాడని మొన్నటి వరకు టాక్ రాగా.. తాజాగా టైగర్ ష్రాఫ్ నటించనున్నాడని అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.

  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)  View this post on Instagram


  A post shared by Kriti (@kritisanon)  ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం పేర్కోంది. ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Adipurush movie, Prabhas, Tollywood news

  ఉత్తమ కథలు