Home /News /movies /

Prabhas | Adipurush Update : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆది పురుష్ నుంచి మరో ఖతర్నాక్ అప్‌డేట్..

Prabhas | Adipurush Update : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆది పురుష్ నుంచి మరో ఖతర్నాక్ అప్‌డేట్..

Prabhas Adipurush Update Photo : Twitter

Prabhas Adipurush Update Photo : Twitter

Prabhas | Adipurush Update : ఇప్పటికే ఈ సినిమాలో కృతి సనన్ షూటింగ్ పోర్షన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ పోర్షన్‌ను పూర్తి చేసిన ఓమ్ రౌత్.. ఇటీవల ప్రభాస్‌తో చేయాల్సిన షూటింగ్‌ పార్ట్‌ను కూడా పూర్తి చేశారు. ఇక తాజాగా మిగితా నటీ నటుల షూటింగ్‌ పార్టు‌ను కూడా పూర్తి చేశారట.

ఇంకా చదవండి ...
  Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఆయన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో తర్వాత ‘రాధే శ్యామ్’  (Radhe Shyam)అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

  ఇప్పటికే ఈ సినిమాలో కృతి సనన్ షూటింగ్ పోర్షన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ పోర్షన్‌ను పూర్తి చేసిన ఓమ్ రౌత్.. ఇటీవల ప్రభాస్‌తో చేయాల్సిన షూటింగ్‌ పార్ట్‌ను కూడా పూర్తి చేశారు. ఇక తాజాగా మిగితా నటీ నటుల షూటింగ్‌ పార్టు‌ను కూడా పూర్తి చేశారట. అంటే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన విడుదలైంది. అంతేకాదు ఈ సందర్భంగా ఓ కేకును కూడా కట్ చేశారు చిత్రబృందం. ఈ సినిమా పూర్తిగా గ్రీన్‌ మ్యాన్‌ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్.


  ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.

  ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. గురుపూర్ణిమా సందర్భంగా ఆ మధ్య ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమా మొదలైంది. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.

  Ravi Teja : రవితేజ ఖిలాడి విడుదలపై క్లారిటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రబృందం..

  ప్రభాస్ (Prabhas), రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం.

  Acharya | Ram Charan : సోషల్ మీడియాలో అదరగొడుతోన్న నీలాంబరి.. మణిశర్మ మెలోడీకి సూపర్ రెస్పాన్స్..

  ఇక ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్  (Spirit) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

  ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

  ఈ సినిమాలతో పాటు ఆయన మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన 24వ సినిమాను హిందీ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయనున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Adipurush movie, Prabhas, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు