Adipurush Update : ప్రభాస్ లేకుండానే ఆదిపురుష్ షూటింగ్ మొదలు.. కారణం ఇదే..

ప్రభాస్ ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్ (Twitter/Photo)

Prabhas : రెబల్ స్టార్ ప్ర‌భాస్ వరుస సినిమాల‌తో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఆదిపురుష్ అనే మైథ‌లాజిక‌ల్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వరుస సినిమాల‌తో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఆదిపురుష్ అనే మైథ‌లాజిక‌ల్ సినిమా ను చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నారు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా న‌టిస్తున్నారు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రలో యువ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.

    ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే నిబంధనలు సడలుతుండటంతో షూటింగ్ మొదకుపెట్టుకునే వెసులుబాటు దొరికింది. ఇక ఈ సినిమా ఈ జూన్ నుండి షూటింగ్‌ను మొదలుకానుందని తెలుస్తోంది. ముంబైలోని ఒక స్టూడియోలో మొదలుపెడతారట. రావణుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ మీద షూటింగ్ జరపనున్నారు. పూర్తిగా గ్రీన్ మ్యాట్ వేసి సిద్ధంచేసిన స్టూడియోలో షూటింగ్ జరుగనుంది. ఈ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌లో జరగనుందట. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేసిన భారీ సెట్‌లో జరగనుంది. అయితే ఇందులో కూడ ప్రభాస్ పాల్గొన్నడం లేదని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ ఆయన లేకుండానే జరుగుతాయట. ప్రభాస్ తప్ప ఇతర ముఖ్య తారాగణం ఇందులో పాల్గొంటారు.

    Prabhas Salaar update, Prabhas Salaar villain, Madhu Guruswamy, Prabhas Salaar movie Launched, Prabhas Prashanth Neel SALAAR movie,SALAAR movie, SALAAR,prabhas news, Prabhas to sign film with KGF director Prashanth Neel,sunny singh, Adipurush Update release date confirmed,Prabhas looks lord rama, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్
    సలార్‌లో ప్రభాస్ Photo : Twitter


    ఈ గ్యాపులో మరోవైపు ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్‌లో పాల్గోననున్నాడట. సలార్ షెడ్యూల్‌ను ముగించుకుని ఆదిపురుష్ షూటింగ్‌లో జాయిన్ అవుతారట. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: