హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ఆదిపురుష్ టీజర్.. అబ్బురపరిచే విజువల్స్.. నెవర్ బిఫోర్ అంతే!

Prabhas: ఆదిపురుష్ టీజర్.. అబ్బురపరిచే విజువల్స్.. నెవర్ బిఫోర్ అంతే!

Adipurush Teaser (Photo Twitter)

Adipurush Teaser (Photo Twitter)

Adipurush Teaser Launch: ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్ నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదల చేసిన క్షణాల్లో ఈ టీజర్ వైరల్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్ (Adipurush) నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ టీజర్‌ని ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రాముడు చివరి దశలో ఈ సరయు నదిలోకి వెళ్లిపోయాడని అంటుంటారు. అలా ఇప్పుడు రాముడు తిరిగిన నేలపైనే ఆదిపురుష్ టీజర్‌ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.

ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్.. భూమి కుంగినా నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అనే డైలాగ్ తో ప్రారంభమైంది. వస్తున్నా! న్యాయం అనే రెండు పాదాలతో పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. అంటూ భారీ డైలాగ్స్ తో ఆధ్యంతం ఆకట్టుకుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ఈ టీజర్ కట్ చేశారు. రాముడిగా ప్రభాస్ లుక్ అబ్బురపరిచింది. నీళ్ళల్లో తప్పస్సు చేస్తూ ప్రభాస్ కనిపించించిన షాట్ టీజర్ లో ప్రధాన ఆకర్షణ. ఈ టీజర్ చూసి ఇది వేరే లెవెల్.. ఇక ఆదిపురుష్‌కి తిరుగులేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇటీవల రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రభాస్.. తదుపరి సినిమాతో ఆ లోటు భర్తీ చేసి రెబల్ స్టార్ (Rebal Star) అభిమానులను హుషారెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆదిపురుష్ సినిమాతో అది తీరుతుందని తాజాగా వదిలిన టీజర్ స్పష్టం చేస్తోంది. మైథలాజికల్ సినిమాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొందించారని అర్థమవుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆదిపురుష్ రూపంలో వస్తున్న ఈ రామ రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం అని ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.

ప్రభాస్ గత రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ తీవ్ర నిరాశ పర్చడంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అనే సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్నాయి.

Published by:Sunil Boddula
First published:

Tags: Adipurush, Om Raut, Prabhas

ఉత్తమ కథలు