Prabhas Adipurush | రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. హోల్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయిన ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో శ్రీ రాముడిగా రాముడిగా నటిస్తే.. లంకేష్ అదేనండి రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రభాస్ సరసన సీత పాత్ర కోసం కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ పేర్లను పరిశీలిస్తున్నారు. వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కేవలం గ్రాఫిక్స్ సన్నివేశాల కోసమే రూ. 250 కోట్లను ఖర్చు చేయనున్నారట. 3D లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ముందుగా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో షూట్ చేస్తారట. వాటికి ఓ వైపు వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తూనే.. కేరళతో పాటు ఉత్తరాదిలోని అడవులతో పాటు శ్రీలంకలో సహజమైన లోకేషన్లతో ఈ సినిమాను పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో మోహన్ బాబు విశ్వామిత్రుడు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ‘ఆదిపురుష్’ సినిమా విషయానికొస్తే.. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి నిరిలీజ్ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adipurush movie, Bollywood, Keerthy Suresh, Kiara advani, Mohan Babu, Om Raut, Prabhas, Saif Ali Khan, Tollywood