news18-telugu
Updated: November 4, 2020, 9:32 PM IST
ప్రభాస్ ‘ఆదిపురుష్’ (File/Photo)
Prabhas Adipurush | ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో జరగనుంది. ఈ షెడ్యూల్ తర్వాత ‘రాధే శ్యామ్’ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఆ తర్వాత మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాకీ ఉండనున్నాయి. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. తన నెక్ట్ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నాడు. కానీ ముందుగా జనవరిలో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు. ఇప్పటికే ఓం రౌత్ ఈ సినిమాను జనవరిలో షూటింగ్ మొదలుపెట్టడానికి అంతా రెడీ చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు కథతో పాటు గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మిగతా నటీనటుల డేట్స్ అన్ని ఓం రౌత్ ఆల్రెడీ తీసుకున్నాడట. సంక్రాంతి తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో ఏకధాటిగా పాల్గొననున్నాడట. ముందుగా ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్ తీసి గ్రాఫిక్స్ వర్క్ చేస్తారట. మిగిలిన షూట్‌ను వచ్చే యేడాది చివర్లో పూర్తి చేస్తారట.

ప్రభాస్ ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్ (Twitter/Photo)
‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే లంకేష్ అదేనండి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ప్రభాస్.. ఈ సినిమా కోసం విలు విద్యలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ దాదాపు ఖరారైంది. మరోవైపు కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.ప్రభాస్ ఓ వైపు ‘ఆదిపురుష్’ సినిమా చేస్తూనే...మరోవైపు ఏప్రిల్‌లో నాగ్ అశ్విన్క సంబంధించిన షూటింగ్లో పాల్గొననున్నాడు.

నాగ్ అశ్విన్ సినిమాలో బిగ్ బి కీలక పాత్ర
ఈ సినిమాను కూడా జనవరిలో ప్రారంభించనున్నారు. ముందుగా ప్రభాస్ లేని సీన్స్ షూట్ పూర్తి చేయనున్నారట. ఏప్రిల్ నుంచి ప్రభాస్ ఈ సినిమా షూట్లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు. మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 4, 2020, 9:32 PM IST