Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఆయన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో తర్వాత ‘రాధే శ్యామ్’ (Radhe Shyam)అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.
రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాన్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 500 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రభాస్.. ‘ఆదిపురుష్’ టీమ్ మెంబర్స్‌కు అత్యంత ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ బహుమతిగా ఇచ్చారు. టెక్నికల్ టీమ్‌లో ఓ మెంబర్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.
one should have a blue tick to get reach otherwise those who gives info in 1st place are completely ignored and questioned who the guys is? where is the pic taken? when was the pic?
no personal issue with the handle just saying😂 pic.twitter.com/WoOCuuuaef
గతంలో ప్రభాస్.. తన జిమ్ ట్రైనర్‌కు రూ. 75 లక్షల ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు ప్రభాస్. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ టీమ్ మెంబర్స్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. తాజాగా ‘ఆదిపురుష్’ టీమ్ మెంబర్స్‌కు ఖరీదైన చేతి గడియారాలు బహుమతిగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా 11 ఆగస్టు 2022 న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. గురుపూర్ణిమా సందర్భంగా ఆ మధ్య ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమా మొదలైంది. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.
ప్రభాస్ (Prabhas), రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం.(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.