హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రపంచ రికార్డు.. ఇది కదా రెబల్ స్టార్ రేంజ్..

Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రపంచ రికార్డు.. ఇది కదా రెబల్ స్టార్ రేంజ్..

Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో మరో రికార్డు సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో మరో రికార్డు సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో మరో రికార్డు సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

  Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో  ప్రభాస్ వరుసగా  అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో తర్వాత ‘రాధే శ్యామ్’  (Radhe Shyam)అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతికి విడుదల కావాల్సింది. ఓమైక్రాన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. త్వరలో ‘రాధే శ్యామ్’ మూవీకి సంబందించిన మరో ఈవెంట్ నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  ప్రభాస్ ‘రాధే శ్యామ్’ తర్వాత ఆయన ఓమ్ రౌత్ దర్శకత్వంలో  ‘ఆదిపురుష్’ (Adipurush) చేస్తున్నారు.  రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

  Ram Charan : అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదు..

  రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ‘ఆదిపురుష్’ మూవీని  పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రభాస్.. ‘ఆదిపురుష్’ టీమ్ మెంబర్స్‌కు అత్యంత ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

  HBD Shruti Haasan: ఈ జనరేషన్‌లో ఆ రెండు రికార్డ్స్ ఉన్న ఏకైక భారతీయ హీరోయిన్ ‘శృతి హాసన్’ మాత్రమే..

  ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమా 11 ఆగస్టు 2022 న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు.  దాదాపు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వాల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తుల వస్తున్నాయి. ఈ రకంగా ‘ఆదిపురుష్’ సినిమా పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈ రకంగా ఆదిపురుష్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేయబోతుంది. ఈ ఫీట్ చూసి ప్రభాస్ అభిమానులు ఇది కదా రెబల్ స్టార్ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

  RRR : ఆ హీరో ఎఫెక్ట్ .. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలయ్యేది ఆరోజే..

  ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమాను చేస్తున్నారు.  ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కంప్లీటైంది.  ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేసారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.

  First published:

  Tags: Adipurush, Bollywood news, Om Raut, Prabhas, Tollywood

  ఉత్తమ కథలు